Bahubali-The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ నుంచి కొత్తగా ఆశించారో మటాష్ అంటున్నారు సినీ లవర్స్. అవును, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా ఫ్రాంఛైజీస్ ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కన్‌క్లూజన్’. ఈ సినిమాలతో మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు రాజమౌళి. ఆయన ప్రతీ సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్-రానా దగ్గుబాటిలతో ఆయన ‘బాహుబలి’ ఫ్రాంఛైజీస్ ని రూపొందించారు.
అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మన తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. ప్రభాస్ కి ఏకంగా పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కింది. అయితే, ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
Bahubali-The Epic: క్వాలిటీ రెట్టింపు స్థాయిలో ఉందని చెప్తున్నారు.
కొన్ని సీన్స్, సాంగ్స్ ని తీసేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31, 2025న రిలీజ్ చేశారు. దీనికంటే ఒకరోజు ముందు ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ షోస్ చూసిన ప్రతీ ఒక్కరు కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఏవీ లేవు కానీ, సినిమా మాత్రం బావుంది అంటున్నారు. ఫస్టాఫ్ లో ఎక్కువగా కాలకేయ ఏపిసోడ్ ఉండగా, సెకండాఫ్ లో అనుష్క కి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. ఇక క్వాలిటీ రెట్టింపు స్థాయిలో ఉందని చెప్తున్నారు.
ఇక, ఈ సినిమా గురించి కొందరు ఫారిన్ ప్రేక్షకులు ‘బాహుబలి’ పార్ట్ 1 వచ్చి పదేళ్ళు అవుతోంది. అప్పటికి, ఇప్పటికీ టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే బాహుబలి ది ఎపిక్ లో కొత్తగా ఫీలవడానికి ఏమీ లేదంటున్నారు. రెండు పార్టులను కలిసి ఒక పార్ట్ గా చేయడానికి సూపర్ హిట్ సాంగ్స్ ని, కొన్ని మంచి సీన్స్ ని తీసేశారు తప్ప, కొత్తగా ఏవైనా సీన్స్ గానీ, సాంగ్స్ గానీ యాడ్ చేశారా అంటే అలాంటిదేమీ జరగలేదంటున్నారు. ఏదేమైనా ‘బాహుబలి ది ఎపిక్’ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సంచలనం సృష్ఠిస్తోంది. ఓ రీ రిలీజ్ సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ సేల్ అవడం కొత్త రికార్డ్ అంటున్నారు.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.