Pooja Hegde : తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రీకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శీనివాస్. ఆయన సినిమా అంటే తెర నిండా నటీనటులు.. సంచులకొద్దీ పంచులు..భారీ యాక్షన్ సన్నివేశాలు..మంచి కామెడీ సన్నివేశాలు..అద్భుతమైన ఎమోషనల్ సీన్స్..ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు నిండుగా మెండుగా ఉంటాయి. ఆయన రచయితగా ఉన్నప్పటినుంచే స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తూ వచ్చారు. అలా ఇండస్ట్రీలో కథ, మాటల రచయితగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఆ తర్వాత దర్శకుడిగా మారి మరో మెట్టు పైకెక్కారు. దర్శకుడిగా త్రివిక్రమ్ అగ్ర స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా మన గురూజీ హీరోయిన్స్‌ను ఎక్కువగా రిపీట్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. మరీ ఎక్కువగా నచ్చితే అదే హీరోయిన్‌ను వరుసగా మూడేసి సినిమాలలో కూడా రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలా రిపీట్ చేసిన వారిలో పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఆమె కెరీర్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అల వైకుంఠపురములో భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి ముందు ఆయన దర్శకత్వంలోనే అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నటించారు. ఈ రెండు హిట్. ఇప్పుడు మూడవసారి ఆయన దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే, ఇటీవల పూజా హెగ్డే నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.
దాంతో ఈ మధ్య పూజాకి గురూజీ ఓ గొప్ప సలహా ఇచ్చారట. ప్రస్తుతం నీకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొన్నాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవద్దంటూ సూచించారట. పూజా కూడా ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాల ఫలితాన్ని నెమరువేసుకొని ఆయన చెప్పినట్టుగా కొత్తవాటికి సైన్ చేయకుండా హోల్డ్‌లో పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మరి నిజంగా త్రివిక్రమ్ చెప్పినట్టే పూజాకి మంచి టైమ్ వచ్చే వరకూ ఇలాగే సెటిల్డ్‌గా ఉంటుందో లేదో చూడాలి.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.