Karthika masam: ప్రతీ ఏటా కార్తీకమాసం మొదలు కాగానే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. ఎంతో కఠోర నియమాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో హిందువులు అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప.. అనే శరణు ఘోషను భక్తులు స్తుతిస్తూ…నియమ నిష్టలను అనుసరిస్తూ…స్వామివారికి పూజలు చేస్తారు. 41 రోజుల కఠోర దీక్ష అనంతరం కేరళలోని 18 కొండలు, 18 మెట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని పాదయాత్ర చేసి దర్శించుకుంటారు భక్తులు.
అయ్యప్ప మాల వేసుకున్న ప్రతీ భక్తుడు తప్పనిసరిగా ఇరుముడిని స్వామివారికి అర్పిస్తారు. అలా చేస్తేనే తమ సంకల్పం సిద్ధిస్తుందని…కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తలపై ఇరుముడిని మోసుకుని శబరిమలకు తీసుకువెళ్లడం అనేది ఒక సాంప్రదాయంగా ఆచారముగా కొనసాగుతోంది. అయితే ఈ ఇరుముడికి ఎంతో విశిష్టత ఉంది… అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప పులి పాల కోసం అడవికి వెళుతున్నప్పుడు… ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రుడికి తోడుగా ఉండే విధంగా అయ్యప్పకు ముక్కంటి కొబ్బరికాయతో పాటు ఆహార పదార్ధాలు ఇచ్చి పంపించాడు. దానిని అయ్యప్పు ఇరుముడులగా కట్టి తనతో తీసుకువెళ్లాడు. దాని తాత్పర్యమే అయ్యప్ప భక్తులు తీసుకువెళ్లే ఇరుముడులు. ఇరుముడి అంటే నేత గుడ్డతో కుట్టిన రెండు భాగాలుగా ఉండే సంచి.
భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో తలపై మోసుకువెళ్లే ఇరుముడిలోని ముందు భాగంలో పసుపు, కుంకుమ, వడ్లు , అటుకులు, వత్తి, నూనె, అయ్యప్పకు ఎంతో ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ..అయ్యప్పకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యం నేతి కొబ్బరి కాయ. ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంద్రం చేసి అందులో నీటిని తొలగించి అందులో కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకెళ్లేతే అదే నేతి కొబ్బరి కాయ. అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవారు. ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది.
కొబ్బరికాయకు మూడు కళ్లు ఉంటాయి కనుక అది శివుని అంశగా భావిస్తారు. మహాలక్ష్మీ శ్రీపతి హృదయంలో నివసిస్తుంది…ఆ విధంగా గోవు అంశం అయిన లక్ష్మీ దేవిని తన హృదయంలో నిలుపుకున్న మహా విష్ణువుని..అయ్యప్ప తల్లి మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది. కనుక కొబ్బరికాయ అందులో నింపబడిన నెయ్యి. శివునికి, విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లిదండ్రులను గుర్తుచేసే ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు. భక్తులను అనుగ్రహిస్తాడు. ఇరుముడిలోని వెనుక భాగంలో పసుపు , బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్ధాలు ఉంటాయి.
అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్ధాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తరువాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇరుముడిలోని వెనుక భాగంలో ఈ పదార్ధాలను తీసుకెళ్తారు. అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులు తల మీద మోసుకువెళ్లే పదార్ధాలు ప్రయాణంలో కొద్దికొద్దిగా తగ్గుతున్నట్లు వారిలోని అహంకారం కూడా తరిగిపోవాలన్న దీని తాతప్పర్యం వారిలోని అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు అన్నీ వారిని వదిలి వెళ్లిపోవాలి. ఇదే అసలైన దీక్ష ప్రాశస్త్యం.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.