Arjun Kapoor : ఆంటీతో లవ్వేంటి?..ట్రోలింగ్ పై హీరో రియాక్షన్ ఇదే

Arjun Kapoor : హీరో హీరోయిన్ లను ఇష్టపడేవారే కాదు . వారిపై విమర్శలు గుప్పించేవాళ్లూ లేకపోలేదు. ఉంటారు. కొంచం హాట్ ఫోటో షేర్‌ చేసినా, బయటకు వెళ్లినా, కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినా , బ్రాండెడ్‌ డ్రెస్సులు, పర్సులు వేసుకున్నా, ప్రేమించినా,పెళ్లి చేసుకున్న , బ్రేకప్‌ ఇచ్చినా ,అఖరికి భార్యకు డివోర్స్ ఇచ్చినా ..కారణం ఏదైనా సరే తిట్లదండకం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.అలా నెట్టింట్లో ఎప్పుడూ ట్రోలింగ్‌ బారిన పడేవారిలో బాలీవుడ్ హీరో అర్జున్‌ కపూర్‌ ఒకరు. అర్జున్ అతని గర్ల్ ఫ్రెండ్ మలైక ఆరోరా గురించి సోషల్ మీడియాలో ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా వీరిపై చేసిన ట్రోలింగ్ పై స్పందించాడు అర్జున్. ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

arjun-kapoor-reacted-on-trolling-about-relation-with-malaika-arora

అర్జున్‌ కపూర్‌ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పెద్ద కొడుకు. ఈయన వయసు 38 ఏళ్లు. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ బ్యాచ్ లర్ అర్జున్. ఇంకా పెళ్లి కాలేదు . ఇతడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో కాదు ఐటం సాంగ్స్ కి డ్యాన్స్ చేసే బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈమె ఏజ్ 50 ఏళ్లు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. విడాకుల తర్వాత మలైక అర్జున్‌ కపూర్‌ తో రిలేషన్ లో ఉంటోంది. ఈ లవ్ బర్డ్స్ దిగే ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

arjun-kapoor-reacted-on-trolling-about-relation-with-malaika-arora

అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే పార్ట్‌నర్‌గా సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? నీకంటే 12 ఏళ్లు పెద్దదైన ఆంటీతో ప్రేమేంటి? అని నెట్టింట్లో నెటిజన్లు అర్జున్‌ను తరచుగా ట్రోల్ చేస్తుంటారు. లేటెస్టుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కాఫీ విత్‌ కరణ్‌ 8వ సీజన్‌ కి గెస్ట్ గా వచ్చిన అర్జున్‌ ఈ ట్రోలింగ్‌పై రియాక్ట్ అయ్యాడు.

arjun-kapoor-reacted-on-trolling-about-relation-with-malaika-arora

” సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్‌ వల్ల ఒకసారైనా బాధపడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ దానిని ఎలా తీసుకుంటామన్నదే ముఖ్యం.  ట్రోలింగ్ వల్ల ..మనుషుల వక్రబుద్ధి బయటపడుతుంది. తప్పుడు కామెంట్లతో సెలబ్రిటీల దృష్టిని తమవైపు తిప్పుకోవాలని అనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు రియాక్ట్ అవ్వాలనుకున్నాను . కానీ నేను వారికి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు. ఆ తర్వాత ఆ ట్రోలింగ్స్ ని లైట్‌ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తారని అర్థమైంది. మళ్లీ వారే సెల్ఫీల కోసం ఎగబడుతారు” అని అర్జున్‌ కపూర్‌ రియాక్ట్ అయ్యాడు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

11 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

12 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.