Health: చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చేస్తున్నారా… అయితే ఇది మీ కోసమే

Health: శీతాకాలం వచ్చిదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఉదయం నిద్ర లేవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఉంటే డే సైకిల్ శీతాకాలం చాలా మంది జీవితాలలో మారిపోతుంది. దానికి కారణం చలికి తట్టుకోలేకపోవడమే. అలాగే శీతాకాలంలో చాలా మంది చన్నీళ్ళ స్నానం చేయడానికి ఇష్టపడరు. హీటర్ తోనో, లేదంటే గీజర్ తోనే, లేదంటే గ్యాస్ పైన వేడి చేసకుని స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్లు లేకుండా ఉదయాన్నే స్నానం చేయడానికి కూడా సాహసించరు. అయితే రోజువారీ ఉద్యోగాల కారణంగా తప్పనిసరి పరిస్థితిలో స్నానం చేయకపోతే శరీరం నుంచి దుర్వాసన వస్తుందనే ఆలోచనతో తప్పనిసరి పరిస్థితిలో స్నానం చేస్తారు. అది కూడా వేడి నీళ్లతోనే చేస్తారు.

అయితే వేడినీళ్లతో స్నానం చేయడం వలన చాలా నానార్ధాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి చన్నీళ్ళ స్నానమే ఉత్తమం అని అంటున్నారు. అయ్యప్ప స్వామిదీక్షలో ఉన్నవారు వేకువ జామున చన్నీళ్ళతోనే స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వలన శరీరంలోని కణాలు ఉత్తేజితం అయ్యి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఒత్తిడిని ఈ చన్నీళ్ళు దూరం చేస్తాయి. అయితే వేడి నీళ్లతో స్నానం చేయడం వలన శీతాకాలంలో మరింతగా చర్మం పొడిబారిపోవడం జరుగుతుంది. శరీరంలో చర్మ రక్షణ కోసం సహజసిద్ధమైన ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది. వేడినీటితో స్నానం చేయడం వలన ఈ సహజసిద్ధ ఆయిల్ ఉత్పత్తి మందగిస్తుంది. ఈ కారణంగా చర్మం మరింతగా పొడిబారిపోతుంది. అలాగే వేడినీళ్లతో తలస్నానం అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చుండ్రు, మురికి సులభంగా వదులుతుందనే ఆలోచనతో వేడినీళ్లతో చాలా మంది తలస్నానం చేస్తారు. అలా చేయడం వలన చర్మ సంబంధమైన అలర్జీ వస్తుందని డర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. వేడినీళ్లతో స్నానం చేయాల్సి వస్తే కచ్చితంగా 5 నిమిషాల్లో మీ స్నానం ముగించాలని అంటున్నారు. అలాగే చలికాలంలో చర్మం పొడిబారిపోకుండా ఉండాలంటే స్నానం చేసే ముందుగా శనగపిండి, పసుపు, పెరుగు లేదా పాలు మిశ్రమంతో ఒక పేస్ట్ లా తయారు చేసి దానిని శరీరానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మం పొడిబారిపోకుండా జాగ్రత్త పడొచ్చు. చలికాలంలో వీలైనంత వరకు వేడినీళ్లతో స్నానం చేయకపోవడమే ఉత్తమం అని వైద్య నిపుణులు అంటున్నారు. కాసేపు కష్టమైన చన్నీళ్ళతోనే స్నానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా చెబుతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

5 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.