Food: సాధారణంగా చాలామంది వేడివేడి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది చల్లగా అయిన ఆహారాన్ని కూడా వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా వేడి చేసుకుని తినడం వల్ల ఆహారం తాజాగా అవుతుందని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి మాటిమాటికి ఆహారాన్ని వేడి చేసుకుని తినటం ప్రమాదాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆహారం వేడి చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే…
అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది మనం తినే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉంచినప్పుడు దానిపై బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారంపై విషాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఆ ఫుడ్ కలుషితం అవుతుంది.
ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరోచనాలు తల తిరగడం వంటివి మొదలవుతాయి.ఈ పరిస్థితినే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు, స్వీట్లు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇక బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఆహారం చల్లబడిన తినడం మంచిది కానీ వేడి చేసుకుని తింటే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.