Animal Review: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. దర్శకుడు ఇచ్చిన భారీ హైప్ కారణంగా యానిమల్ మూవీపై అటు హిందీలో ఇటు తెలుగులో అసాధారణంగా అంచనాలు పెరిగాయి. రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే, ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వినిపించింది. కథ, కథనాలు చాలా బలహీనంగా ఉన్నాయని సందీప్ రెడ్డి వంగ నుంచి ఆశించిన కంటెంట్ లేదని అభిప్రాయపడుతున్నారు వీక్షకులు. పబ్లిక్ టాక్ వింటే సినిమా చూడాలా వద్దా..? అనే సందేహాలు ఇక్కడ జనాలలో కలుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ అంటే తెలుగులో ‘అర్జున్ రెడ్డి’, హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమాలు కళ్ళ ముందు మెదులుతాయి.
Animal Review: బాలీవుడ్ సినిమాలు మన టాలీవుడ్ లో ఆడటం లేదు.
ఆరకంగా సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రన్‌బీర్ కపూర్ ని ఎలివేట్ చేసిన విధానం చూస్తే మెంటలెక్కుతుందని సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి వారూ కితాబిచ్చారు. కానీ, ఆ అంచనాలకి భిన్నంగా టాక్ వినిపించింది. బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో సందీప్ రెడ్డి వంగ తడబడ్డాడని చెప్పుకుంటున్నారు. అసలే గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు మన టాలీవుడ్ లో ఆడటం లేదు.
కానీ, తెలుగు దర్శకుడు, తెలుగు హీరోయిన్..ఇందులో కీలక పాత్రలు పోషించిన అనిల్ కపూర్, బాబీ డియోల్ లకి టాలీవుడ్ లో తెలిసిన వాళ్ళు కావడం యానిమల్ కి కలిసొచ్చే అంశాలనుకున్నారు. కానీ, అసలైన కథ..కథనాలలో పట్టు లేకపోవడంతో ఇక్కడ ‘యానిమల్’ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా ఆశించినంత రాబట్టలేకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.