Animal Review: రష్మిక మందన్న ఖాతాలో మళ్ళీ ఫ్లాప్..’యానిమల్’ దెబ్బ గట్టిగా పడినట్టే..! అంటూ తాజాగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ వారం భారీ అంచనాల మధ్య వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. ఈ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మిగతా సౌత్ భాషలలోనూ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిపారు.
ఈ ఈవెంట్ కి రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో వచ్చి సినిమాపై తెగ హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన హైప్ ఒకెత్తైతే రాజమౌళి, మహేశ్ ఇచ్చిన బూస్టింగ్ ఇంకో ఎత్తు. దాంతో ‘యానిమల్’ సినిమాపై మరీ ఎక్కువగా అంచనాలు క్రియెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న లైఫ్ టర్న్ అవుతుందనీ నమ్మకాలు పెట్టుకుంది.
Animal Review: నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
జనాలు కూడా ‘యానిమల్’ సినిమాతో రష్మిక మందన్న బాలీవుడ్ లో బలంగా నిలబడుతుందని చర్చించుకున్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రిలీజై ‘యానిమల్’ నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. రన్ టైం గురించి పట్టించుకోకండి అన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై కామెంట్స్ కురుస్తున్నాయి. సినిమా ఇలా ఉంటుందనే ముందుగా సందీప్ ప్రేక్షకులను ప్రిపేర్ చేశారా..అని మాట్లాడుతున్నారు.
మిగతా వారికంటే ఎక్కువగా నమ్మకాలు పెట్టుకున్న రష్మిక మందన్నకి ‘యానిమల్’ మూవీ గట్టిగానే నెత్తిమీద మొట్టిందని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ‘పుష్ప’ తర్వాత మళ్ళీ రష్మిక ఖాతాలో సక్సెస్ చేరింది లేదు. ఈ మూవీపై పెట్టుకున్న నమ్మకాలు తారుమారయ్యాయి. ‘యానిమల్’ కూడా రష్మిక ఖాతాలో ఫ్లాప్ మూవీగా చేరిందంటున్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.