Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచుగా వర్తల్లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నామధ్య బీచ్ లో బికినీతో అందాలను చూపించి రచ్చ రచ్చ లేపింది, ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఇండైరెక్ట్ గా కామెంట్ చేసి అనసూయ ట్రోలింగ్ కి గురైంది. అనేక వివాదాల్లో చిక్కుకున్న అనసూయ కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా ఆశ్రయించింది. మధ్యలో కాస్త సైలెంట్ అయిన అనసూయ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మ్యాటర్ లోనూ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అనసూయ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడేమో బొద్దుగా ఉన్న అనసూయ నాజూకుగా మారేందుకు వర్కౌట్ లు చేస్తోంది. దీనితో నెటిజన్స్ మరోసారి అనసూయ వెనకాల పడ్డారు.
అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకంగా యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతుంటుంది. తాజాగా దసరా ఫెస్టివల్ సందర్భంగా జిమ్ వర్కౌట్ వీడియోను అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ చెమటలు కక్కేస్తున్న వీడియోని పంచుకుంది. అంతేకదండీ ఈ వీడియో తో పాటు మహిళలని ప్రోత్సహించేలా ఓ పొడవాటి పోస్టును రాసింది. ఈ సొసైటీలో దుష్ట శక్తులపై పోరాడేందుకు ప్రతి మహిళ కాళీగా మారాల్సి ఉందని ఆమె ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. సోమరితనాన్ని బద్ధకాన్ని జయించండి అని చెప్పింది.
” రెండేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. ఒక్కసారిగా అన్నింటి పై ఆశలు పోయాయి. ఫుడ్ హ్యాబిట్స్ , నిద్ర గాడి తప్పాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకే ఈ దసరా నుంచి వర్కౌట్స్ స్టార్ట్ చేశాను. మహిళలందరిని ఈ వీడియో ఎంకరేజ్ చేస్తుందని ఆశిస్తున్నాను. స్త్రీ శక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరు ఏమి అన్నా పట్టించుకోకు. నీ శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్లు.
చాలా మంది నిన్ను ఆంటీ అని, 35 దాటిన నీకెందుకు ఈ జిమ్ వర్కౌట్స్ అని, ఇంట్లో పిల్లల్ని చూసుకోమని సలహా ఇస్తారు. ఇలా కామెంట్స్ చేసే వారంతా తమ ఎదుగుదలను చూసి భయపడేవారు” అని అనసూయ తన నోట్ లో రాసింది అనసూయ బేబీ . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బొద్దుగా ఉన్న అనసూయ ఇంతలా వర్కౌట్స్ చేస్తే ఎలా? అంటీ ఈ వయసులో ఇది అవసరమా అంటూ నిటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.