Anchor Anasuya : నేను మరీ అంత చీప్ కాదు..అనసూయ

Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచుగా వర్తల్లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నామధ్య బీచ్ లో బికినీతో అందాలను చూపించి రచ్చ రచ్చ లేపింది, ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఇండైరెక్ట్ గా కామెంట్ చేసి అనసూయ ట్రోలింగ్ కి గురైంది. అనేక వివాదాల్లో చిక్కుకున్న అనసూయ కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా ఆశ్రయించింది. మధ్యలో కాస్త సైలెంట్ అయిన అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి అనసూయ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో తమపై కామెంట్లు చేసిన ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. చురకలు అంటించింది అనసూయ.

anchor-anasuya-i-am-not-that-much-cheap-anasuya-fire-on-netizen

ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లిల పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయనను కలిసేందుకు, ఫోటోలు దిగేందుకు చాలామంది ఫ్యాన్స్ మండపం దగ్గర పోటీ పడ్డారు. దీంతో ఒకింత తోపులాట జరిగి గందరగోళంగా మారింది. ఇక రంగలోకి దిగిన పర్సనల్ సిబ్బంది పవన్ కల్యాణ్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది.

anchor-anasuya-i-am-not-that-much-cheap-anasuya-fire-on-netizen

అసలు ఈ వీడియో విషయం పక్కన పెడితే ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. పవన్ వీడియోపై సదరు వ్యక్తి ఏం కామెంట్ చేశాడంటే… “అయితే ఏంది.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలుస్తాడా? యాంకర్ అనసూయ, రష్మిలు వచ్చినా జనాలు ఇలాగే ఎగబడతారు “అని హాట్ వ్యాఖ్యలు చేశాడు.

anchor-anasuya-i-am-not-that-much-cheap-anasuya-fire-on-netizen

ఈ కామెంట్‌పై అనసూయ ఘాటుగా రియాక్ట్ అయ్యింది ” ఇలా మా గురించి చులకనగా మాట్లాడటం సరికాదు. నేను ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాను. నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. మమ్మల్ని గౌరవించాలి. అసలు ఈ ఇష్యూ లోకి నా పేరును లాగడం తప్పు. మీరు చెప్పినట్లు మమ్మల్ని చూసేందుకు జనం ఎగబడతారు. ఎందుకంటే లైఫ్ లో ఏదో ఒకటి సాధించిన వాళ్లు ఎలా ఉంటారో చూడాలనే వారు వస్తారు. మీరు మా పేర్లు చెప్పినంత ఈజీ గా ఈ లెవెల్ కి రాలేరు”. అంటూ అనసూయ ఫైర్ అయ్యింది.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

1 day ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

4 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

4 days ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

5 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

1 week ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

1 week ago

This website uses cookies.