Anasuya: “పార్టీలకి దూరం” అంటే కమిట్‌మెంట్ గురించే చెప్పిందా..?

Anasuya: ఫేమస్ యాంకర్ కం నటి అనసూయ పార్టీలకి దూరం..అందుకే నాకు హీరోయిన్‌గా ఛాన్సులు రాలేదు..అంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్మాల్ స్క్రీన్ మీద బాగా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ భద్వాజ్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతోంది. కథ, పాత్ర నచ్చితే ఎంత బోల్డ్‌గా అయినా నటించడానికి వెనకాడటం లేదు.

‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన పాత్ర వాస్తవానికి ముందు సీనియర్ హీరోయిన్ రాశికి ఆఫర్ చేశారు సుకుమార్. కానీ, రాశి మోకాళ్ళ పైవరకు ఎత్తి చూపించాలంటే ఇబ్బంది పడి నో చెప్పేసింది. అదే ఛాన్స్ అనసూయకి వచ్చేసరికి ధైర్యంగా ఒప్పుకుంది. అంతేకాదు, సుకుమార్ అనుకున్నదానికంటే ఇంకా బాగా పర్ఫార్మ్ చేసి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది.

anasuya- “Distance from parties” means commitment..?

Anasuya: త్రివిక్రం కి సారీ కూడా చెప్పినట్టు తెలిపింది.

ఆ తర్వాత ‘పుష్ప 1’ లో చేసిన పాత్ర కూడా అనసూయకి చాలా మంచి పేరు తెచ్చింది. ‘క్షణం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా అంతే. ఇలాంటి పాత్రలు ఎంచుకుంటుంది కాబట్టే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటెం సాంగ్ చేయమని త్రివిక్రం ఆఫర్ చేస్తే నిర్మొహమాటంగా నో చెప్పింది. దీనికి కారణం ఆ ఐటెం సాంగ్‌లో సమంత, ప్రణీత, ముంతాజ్, హంస నందిని లాంటి వాళ్ళు ఉన్నారు.

anasuya- “Distance from parties” means commitment..?

అంతమంది ఉన్నారు కాబట్టే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటెం సాంగ్స్ వచ్చిన గుంపులో ఎందుకని వదిలేసిందట. ఈ విషయంలో దర్శకుడు త్రివిక్రం కి సారీ కూడా చెప్పినట్టు తెలిపింది. అయినా అప్పట్లో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్స్ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. వాటిని కూడా లెక్కచేయలేదు. అంతేకాదు, కొంతమంది మీకు హీరోయిన్స్ ఛాన్స్ రాలేదా..? అని అడుగుతున్నారు. నేను షూటింగ్ అయిపోగానే పార్టీలకి వెళ్ళను. నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. అందుకే నాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వలేదు..అంటూ చెప్పుకొచ్చింది. దీనర్థం పార్టీలకి అంటే కమిట్‌మెంట్ ఇవ్వాలనా..? అంటూ నెటిజన్స్ అనసూయని అడుగుతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

5 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.