intresting survey: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి బంధం అనేది కచ్చితంగా ఉంటుంది. పెళ్లి బంధం తర్వాత మన జీవితాలలోకి వచ్చే వ్యక్తులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైవాహిక జీవితాన్ని అలాగే మన జీవితంలోకి కొత్తగా వచ్చిన బంధాలు, బంధుత్వాలతో ఎలాంటి మాట పట్టింపులు, అనవసరమైన టెన్షన్ లు లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అనే సామెత ప్రతి కాలానికి కరెక్ట్ గా వర్తిస్తుంది. ప్రతి మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మనం ఆడే మాట కరెక్ట్ గా ఉన్న ఆ మాటని అర్ధం చేసుకునే వ్యక్తుల వ్యక్తిత్వం కరెక్ట్ గా లేకపోతే కచ్చితంగా వ్యత్యాసాలు వస్తాయి.
ప్రస్తుత జెనరేషన్ లో మనుషుల వ్యక్తిత్వాలలో ఎక్కువగా నెగిటివిటీ పెరిగిపోయింది. చిన్న వాళ్ళ నుంచి పెద్దల వరకు అందరి ఆలోచనలు అదుపు తప్పాయి. చిన్న చిన్న విషయాలని కూడా పెద్దగా చూపించడం, అలాగే చిన్న చిన్న సమస్యలకి కూడా విపరీతంగా భయపడిపోవడం కనిపిస్తుంది. ఇక అమ్మాయిలలో అయితే యుక్త వయస్సులో స్వేచ్చగా తిరగాలని అనుకుంటారు. అయితే అలా తిరిగే సమయంలో వారు చేసే చిన్న చిన్న తప్పులు ఎక్కడ తెలిసిపోతాయో అని ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. అలాగే కొంత మంది మాత్రం పెళ్ళికి ముందు లేని స్వేచ్చని పెళ్లి తర్వాత పొందాలని అనుకుంటారు. మరికొంత మంది ఎప్పుడూ కూడా తమ జీవితం పూర్తిగా తమ చేతిలోనే ఉండాలని, వేరొకరు తమపై పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదని అనుకుంటారు.
ఇలా ఎన్ని రకాల ఆలోచనలు ఉన్న స్త్రీ, పురుషుల జీవితాలలో వివాహబంధం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇలా ఒక వయస్సు వచ్చాక వివాహబంధంతో వేరొక వ్యక్తి జీవితంలోకి వచ్చినపుడు, అలాగే ఆ వ్యక్తితో పాటు అత్త, మామలు, ఆడపడుచులు అంటూ కొత్త బంధాలు అన్ని కూడా వస్తాయి. అందరితో కలిసి ఉన్నా లేకున్నా మెజారిటీగా ఈ బంధాలు మాత్రం మానవ సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. పెళ్లి తర్వాత భర్తతో ఎలా మసులుకోవాలి, అతన్ని ఎలా ఆకట్టుకోవాలి, అతను మన మాట వినేలా ఎలా చేసుకోవాలి, అత్తమామల అభిమానం పొందడానికి ఏం చేయాలి, వారు కూడా తన మాట వినేలా ఎలా మార్చుకోవాలి అనే విషయాలని అమ్మాయిలకి ఆమె తల్లి, లేదంటే దగ్గర బంధువులు, వివాహబంధంలోకి అడుగుపెట్టిన స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు.
అయితే అలాంటి సలహాలు తీసుకోవడం ఈ తరం అమాయిలకి బొత్తిగా ఇష్టం ఉండదు. ఒక వేళ ఇష్టం ఉన్న సలహాలు చెప్పేవారు కూడా లేరు. ఈ నేపధ్యంలో పెళ్లి తర్వాత జీవితంలో ఎలా ఉండాలి, భర్తని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడు అమ్మాయిలు గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు. లైఫ్ కోచ్ లు అంటూ చాలా మంది ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటారు. వారి వీడియోలు, అలాగే వారు రాసే జర్నల్స్ చదవడం ద్వారా పెళ్ళైన అమ్మాయిలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు అయితే భర్త తన మాట వినేలా చేసుకోవడం ఎలా అనే అంశాన్ని ఎక్కువగా గూగుల్ లో శోదిస్తున్నారని తెలుస్తుంది. అలాగే గర్భధారణకి ఏ సమయంలో కలిస్తే మంచిది అనే విషయాన్ని కూడా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్ లో వెతుకుతున్నారు అని తాజా అధ్యయనంలో బయటపడింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.