Water Melon: వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి పెద్ద ఎత్తున పుచ్చకాయలు వస్తుంటాయి పుచ్చకాయలను వేసవికాలంలో తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వడదెబ్బకు గురి కాకుండా ఉంటుంది అంతేకాకుండా మన శరీరం నీటి శాతాన్ని కోల్పోకుండా ఎప్పుడు హైడ్రేట్ గానే ఉంచుతుంది. ఈ విధంగా పుచ్చకాయలు తినటం ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే చాలామంది పుచ్చకాయ తిని అందులో ఉన్నటువంటి గింజలను బయటపడేస్తూ ఉంటారు. ఇలా పుచ్చకాయ గింజలను పడేయటం పెద్ద పొరపాటు అని ఈ గింజలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్‌తో పాటు పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు.
ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. పైగా ఇందులో ఉండే క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లకు పుచ్చగింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ గింజలలో ఉన్నటువంటి ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు చురుగ్గా పనిచేయడానికి ఎంతగానో దోహద పడతాయి. ఈ పోషకాలు కామెర్ల వ్యాధిని నివారించడానికి కూడా తోడ్పడతాయి. ఇక ఈ గింజల నుంచి తీసినటువంటి నూనెలను ఎన్నో కాస్మెటిక్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ గింజలను తినటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి కనుక ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలతో సహా తినటం ఎంతో ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.