Allu Sirish: అల్లువారబ్బాయి శిరీష్ మంచు లక్ష్మీకి ఇలా ముద్దు పెట్టేశాడేంటీ..? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులను, ఎన్.టి.ఆర్ దంపతులను, వెంకటేశ్ ఫ్యామిలీని, నాగార్జునని ఆహ్వానించారు. వారితో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలాగూ అక్కడే ఉంటారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య దంపతులు కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ కలిసి ఒకే ఫ్రేం లో ఉన్న పిక్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. చిరు ఇంటికి ఒక్క బాలకృష్ణ తప్ప మిగతా టాప్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు. దీనిపై కూడా నెట్టింట ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
అయితే, ఇదే క్రమంలో అల్లు శిరీష్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టిన పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తూ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ అటు మెగా ఫ్యామిలీతో, ఇటు అల్లు ఫ్యామిలీతో అలాగే అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ చిన్న సెలబ్రేషన్‌లో పాల్గొన్నా, దానికి సంబంధించిన వీడియోలను గానీ, ఫొటోలను గానీ తన ఇన్స్టాగ్రాం లో షేర్ చేస్తుంటుంది.
అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ కి మంచు లక్ష్మీ కూడా హాజరైంది. సోదరుడుగా భావించే అల్లు శిరీష్‌తో మంచు లక్ష్మీ సరదాగా గడిపింది. ఆ సమయంలో తన అక్క వంటి మంచు లక్ష్మీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు శిరీష్. ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.