Allu Arjun : సోషల్ మీడియాలో పుష్ప పుష్ పాట సెన్సెషన్ సృష్టిస్తోంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. బన్నీ స్టెప్స్ నెట్టింట్లో దుమ్ముదులుపుతున్నాయి. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎప్పటిలాగే మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్తో ఓ ఊపు ఊపేశాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మ్యానరిజం ఫ్యాన్స్ ను ఊర్రూతలుగించింది.ఏ సోషల్ మీడియా చూసినా పుష్ప.. పుష్ప అనే పాటే వినిపిస్తోంది. ఇండియా మొత్తం తెగ వైరలవుతుంది. అప్పట్లో పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో కాలి చెప్పు వదిలేసిన చేసిన స్టెప్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ఇప్పుడు పుష్ప పాటలో కూడా షూ స్టెప్ అంతే ఫేమస్ అయ్యింది. ఈసారి అల్లు అర్జున్ రెట్టింపు ఎనర్జీతో ఈ పాటను చేశాడు. ఈ పాటలోని కొంత ట్రాక్ వీడియోను బన్నీ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేశాడు. ఈ స్టెప్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
బన్నీ పోస్టుతో ప్రస్తుతం షూ హుక్ స్టెప్ గ్లోబల్ లెవెల్ లో ఫేమస్ అవుతోంది . #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ అవుతున్నాయి. బన్నీ పోస్టుకు అభిమానులతో పాటు సెలబ్రెటీస్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సాంగ్ పై రియాక్ట్ అయ్యాడు. స్టెప్ చాలా బాగుందని, నాకు కొత్త పని పడింది అని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన బన్నీ రిప్లై ఇస్తూ..ఇది చాలా ఈజీ మనం నేను మీకు నేర్పిస్తాను అని నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషన నెట్టింట వైరలవుతుంది.
డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగులో విడుదలయ్యే చాలా వరకు స్టార్ హీరోల సినిమా పాటలకు రీల్స్ తన ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. స్టార్ హీరోల ఫేమస్ డైలాగ్స్, డాన్స్ స్టెప్పులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బన్నీ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో ని పాటలు, డైలాగ్స్ రీల్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతే కాదు పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్పులు కూడా వేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇక త్వరలోనే పుష్ప2లోని టైటిల్ సాంగ్ షూ స్టెప్ కూడా వేసేందుకు రెడీ అయ్యారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.