Categories: EntertainmentLatest

Allu Arjun : కేజీఎఫ్‎ను ఫాలో అవుతున్న పుష్పరాజ్

Allu Arjun : ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హడావుడి కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రెండు పార్టులగా మేకర్స్ రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ బాగుండి, కలెక్షన్స్ పక్కా అని తెలిస్తే మూడో భాగానికి బాటలు వేస్తున్నారు. అలా మూడు భాగాలుగా వస్తున్న భారీ ప్రాజెక్టుల్లో కేజీయఫ్‌3 ఒకటి. ఇక ఈ లిస్టులో తాజాగా ఇప్పుడు పుష్ప కూడా చేరింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఆల్ ఇండియాను షేక్ చేసింది. భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో దర్శకుడు సుకుమార్ అదే ఊపుతో పుష్ప2: ది రూల్‌ రూపొందించాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ పుష్ప3 చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా పలు వేదికలపైన ఈ విషయం గురించి మాట్లాడారు. ఈ నేపథ్ంలో కేజీయఫ్‌ ఫార్ములాను పుష్పరాజ్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేజీయఫ్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ తో వేరే కమిట్ మెంట్స్‌కు వెళ్లిపోయారు.

allu-arjun-is-iconic-star-fallowing-kgf

కేజీఎఫ్ సినిమాతో హీరో యశ్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది. రీసెంట గా ప్రశాంత్ డార్లింగ్ ప్రభాస్ తో సలార్ మూవీ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఇఖ ఇప్పుడు ప్రభాస్‌తో సలార్‌-2 చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఇక యశ్‌ తో టాక్సిక్‌ మూవ పూర్తి చేయాలి. ఆ తర్వాతే కేజీయఫ్‌ 3 పట్టాలెక్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అందుకోసం కనీసం మూడేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో యశ్‌ మరేదైన సినిమా ఒప్పుకొంటే మాత్రం కేజీఎఫ్ 3 మరింత ఆలస్యం కావచ్చు.

allu-arjun-is-iconic-star-fallowing-kgf

ఇప్పుడు పుష్ప3 విషయంలోనూ ఇదే ఫార్ములా అమలుకానున్నట్లు తెలుస్తోంది. బన్నీ పుష్ప2 రిలీజైన తర్వాత వెంటనే పుష్ప3 మొదలుపెట్టడు. ఎందుకంటే అల్లు అర్జున్‌ లైనప్ లో వరుసగా మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ కోసం ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. అయితే వీరిద్దరి సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక త్రివిక్రమ్ తో మూవీ ఉంటుందని అప్పట్లోనే బన్నీ చెప్పాడు. స్టోరీ కూడా రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే సుక్కు

allu-arjun-is-iconic-star-fallowing-kgf

మరోవైపు రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ కోసం పనిచేయాలి. బుచ్చిబాబు మూవీ పూర్తైతే కానీ చరణ్ సుకుమార్ కు అందుబాటులోకి రారు. అప్పుడే సుకుమార్‌-చరణ్‌ మూవీ లైనప్ లోకి వస్తుంది. అప్పటివరకూ సుకుమార్ వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ కావడానికి మూడేళ్లు పట్టవచ్చు. ఈ లెక్కన కేజీయఫ్‌3, పుష్ప3 కాస్త అటూ ఇటూగా సెట్స్‌పైకి వెళ్లవచ్చు.

Sri Aruna Sri

Recent Posts

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ..?

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…

7 hours ago

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

3 weeks ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

3 weeks ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

3 weeks ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

3 weeks ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

3 weeks ago

This website uses cookies.