Allu Arjun : పుష్ప సినిమా విడుదలై మూడేళ్లు అవుతోంది. పుష్ప ప్రాంచైస్ కాకుండా బన్నీ మరో ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ప్రస్తుతం బన్నీ ధ్యాస మొత్తం పుష్ప2 మీదే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ అందించాడు. బెర్లిన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
జర్మనీలో నిర్వహించిన ప్రెస్టీజియస్ బెర్లిన్ ఫెస్టివల్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఫిబ్రవరి 15 నుంచి 25వరకు జర్మనీలో ఆ ఫెస్టివల్ జరుగనుంది. ఈ క్రమంలో 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బన్నీ కూడా భాగం అయ్యాడు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీకి ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ లభించింది. భారత్‌లో ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను, ప్రశంసలను అందుకుని రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా పుష్పా మూవీ బెర్లిన్ ఫెస్టివల్లోనూ సందడి చేసింది.
ఈ ఫెస్టివల్‌లో ‘పుష్ప’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ మూవీ ప్రదర్శన పూర్తైన తర్వాత బన్నీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌లతో కాసేపు మాట్లాడారు. ఆపై భారతీయ సినిమా ప్రాముఖ్యత, హిస్టరీ గురించి పలు అంశాలపై అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్ -3 గురించి బన్నీ క్రేజీ అప్డేట్ అందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పుష్ప 3 కూడా ఉండొచ్చని ఈ మూవీని ఓ ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు బన్నీ చెప్పాడు.
ఇంకా పుష్ప 2 రిలీజ్ కాకముందే పుష్ప3పై ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున బన్నీ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచాడు. రెండో భాగం రిలీజయ్యాక మూడో భాగం గురించి అనౌన్స్ మెంట్ రావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తువన్నారు. అయితే బన్నీ ఇప్పటకే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా సినిమాను సైన్ చేశాడు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఈ టైంలో మరి పుష్ప-3 రావడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.