Akkineni Venkat : అక్కినేని ఫ్యామిలీ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లో ఆయనకు ఉన్న ఫేమ్ అలాంటిది మరి. ఆయన వరసత్వాన్ని ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తోంది. అక్కినేని నాగేశ్వరావుకు ఇద్దరు కొడుకులు. అక్కినేని వెంకట్ పెద్ద కొడుకు కాగా.. అక్కినేని నాగార్జున రెండో కొడుకు. వీరిద్దరూ ఇండస్ట్రీలోనే ఎదిగారు. నాగ్ హీరోగా సెటిల్ అయ్యారు, అన్న వెంకట్ ప్రొడ్యూసర్. అయితే నాగార్జున తెలిసినంతగా చాలామందికి వేంకట తెలియకపోవచ్చు.ఇక నాగేశ్వరరావు గారు చనిపోయాకా.. అక్కినేని కుటుంబంలో విబేధాలు అంటూ రూమర్స్ వచ్చాయి. ఆస్తి పంపకాల్లో, అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో అన్నదమ్ముల గొడవలు వచ్చాయని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై నాగ్ ఏరోజు రియాక్ట్ లేదు.అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మాత్రం వెంకట్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.
అక్కినేని వెంకట్ టాలీవుడ్ లో పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అన్నపూర్ణ బ్యానర్‌పైనే ఆ చిత్రాలన్నీ నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసత్వాన్ని నాగార్జున సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కానీ వెంకట్ అమెరికాలో చదువుకుని భారత్ తిరిగొచ్చారు. అయినా ఆయన మీడియాకు కొంచెం దూరంగానే ఉంటుంటారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
” నేను, నాగార్జున ఇండస్ట్రీ వాతావరణంలో పెరగలేదు. మా ఇద్దరికీ సినిమాల గురించి అంతగా అవగాహన లేదు. మేము బాగా చదువుకోవాలని నాన్నగారు మమ్మల్ని ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. నాన్నగారు ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలను మాపై రుద్దే ప్రయత్నం చేయలేదు. మా ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా ఎంట్రీ గురించి నేనే నాన్నగారితో మాట్లాడాను. ఆయన వెంటనే ఓకే అన్నారు.
నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నానని భయపడుతూనే నాన్నగారిని అడిగాము. దానికి ఆయన సరేనన్నారు. ఆ తరువాత చాలాకాలం అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలన్నీ నేను చూసేవాడిని. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని నేనే పక్కకి తప్పుకున్నాను . సినిమా వ్యవహారాలు నాకు అంతగా తెలియవు.. ఆ విషయాలపై నాగ్ కు మంచి పట్టు ఉంది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేమిద్దరం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాము. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్నీ నాగార్జుననే దగ్గరుండి చూసుకుంటున్నాడు” అని వెంకట్ తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.