Akira Nandan : పవన్ కళ్యాణ్ కొడుకుకి హీరో అవ్వాలనిలేదా..? అంటే తాజాగా వచ్చిన అప్‌డేట్ చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 10 మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన వేసిన బాటలో తమ్ముళ్ళు, అళ్ళుల్లు, కొడుకు..ఇలా ఓ వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ హీరో అవుతున్నాడంటే అప్పట్లో అదో హాట్ టాపిక్. అంతకముందు పవన్ కళ్యాణ్ హీరో అయినప్పుడే అంతే.
ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన హైప్ భారీ స్థాయిలో క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే గనకొంతకాలంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఇస్తాడని. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అందరూ స్టార్స్‌గా నిలదొక్కుకున్నారు. వీరిలో పవన్ కళ్యాణ్‌కి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
ఇప్పుడు ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం చాలా కష్టం. కానీ, తాజాగా అకీరా హీరో కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అకీరా హీరో ఎంట్రీ కంటే ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరో అవుతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ విషయాన్ని హీరో అడవి శేష్ వెల్లడించారు. కార్తికేయ యార్లగడ్డ ‘రైటర్స్ బ్లాక్’ అనే షార్ట్ ఫిల్మ్ ను ఇంగ్లీష్ లో రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కి అకీరా సంగీతం అందించాడు. కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా అద్భుతమైన సంగీతం అందించాడని అందరూ అకీరాను పొడుతున్నారు. చూడాలి మరి దీనిపై అటు మెగా ఫ్యామిలీ ఇటు ఇండస్ట్రీ వర్గాలు మరీ ముఖ్యంగా తండ్రి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.