Agent Movie: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని అఖిల్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మేంట్ తో కలిసి సురేందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ కోసం ఏకంగా 80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ అయితే లేదు. అయితే ఏజెంట్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నాడు. దానికోసం సురేందర్ రెడ్డి ఎలా కావాలంటే అలా తయారయ్యాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ తరహా పాత్రలో అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే సిరీస్ లు చేయడానికి కూడా స్కోప్ ఉన్న కథగా ఏజెంట్ ఉంది. ఇక పవర్ ఫుల్ పాత్రలో అఖిల్ ఈ సినిమాలో నటించబోతూ ఉండటం దీనిపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే అఖిల్ కి హీరోగా మంచి ఇమేజ్ ఉంది. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అక్కినేని ఫ్యామిలీలో అతిపెద్ద మార్కెట్ ఉన్న హీరోగా అఖిల్ ఉన్నాడు. అయితే ఆ మార్కెట్ కి తగ్గట్లుగా అతని సినిమాలు ఉండటం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏజెంట్ తో ఆ ఇమేజ్ ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనికి సంబందించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే . ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా అన్ని భాషలలో కలిపి 120 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అంటే చిన్న విషయం కాదు. పాన్ ఇండియా సినిమాలకే ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో బిజినెస్ పరంగా ఇప్పుడు అఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అనే మాట వినిపిస్తుంది. అయితే ఏజెంట్ సక్సెస్ తో దానిని కొనసాగించడమే అతని చేతిలో ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.