Adipurush-Prabhas : సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో ప్రభాస్ ఆది పురుష్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్ లో వస్తున్న ఈ సినిమాకి ఆది నుంచి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఆది పురుష్ గ్రాఫిక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్, ఆంజనేయుని లుక్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అందుకే సంక్రాంతి టైంలో విడుదల కావాల్సిన ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి మరోసారి అప్డేట్ చేసి తెర ముందు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. సంబంధించి ఓ అప్డేటెడ్ న్యూస్ నటింట్లో వైరల్ అవుతుంది. మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీజర్ లో ప్రభాస్ కట్స్ ప్రత్యేకంగా హైలెట్ చేసి విడుదల చేశారు మేకర్స్. జూన్ 16న సినిమా విడుదల కాబోతోంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
పీరియాడికల్ డ్రామా ‘ఆది పురుష్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు ’.సీతగా కృతి సనన్ కనిపిస్తోంది.రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఇది. ఈ సినిమా మరో రెండు నెలల్లో విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన టీజర్ లో రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేశారు మూవీ మేకర్స్.
చిత్రానికి సంబంధించి మూవీ టీం గతంలో ఓ టీజర్ రిలీజ్ చేసింది. అయితే దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. చీప్ వీఎఫ్ఎక్స్ వాడారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ దుమ్మెత్తి పోశారు. దీంతో మూవీ మేకర్స్ అలర్ట్ అయ్యారు. 100 కోట్లు ఆయిన బడ్జెట్ ను 150 కోట్లకు పెంచి మళ్లీ వీఎఫ్ఎక్స్ చేయించారు. ఆ అప్డేటెడ్ వర్షన్ నే ఇప్పుడు టీజర్ రూపంలో విడుదల చేశారు మూవీ మేకర్లు.
ఈ కొత్త టీజర్ కాస్త కన్విన్స్ గానే ఉందండి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు గతంతో పోలిస్తే మెరుగైన విఎఫ్ఎక్స్ ఉన్నాయని అంటున్నారు. మరికొందరు మాత్రం వీఎఫ్ఎక్స్ లో మార్పులు చేసినా అంతగా ఆకట్టుకోనేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆది పురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారైన గట్టి హిట్టుతో ముందుకు వస్తాడని ఆశపడుతున్నారు.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.