Actress Mohini Chirstina: క్రైస్తవ మత ప్రచారకురాలిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Actress Mohini Chirstina: టాలీవుడ్‌లో ఒక కాలంలో స్టార్‌ హీరోలతో కలిసి స్క్రీన్‌ పంచుకున్న నటి ఇప్పుడు క్రైస్తవ మత బోధకురాలిగా మారిపోయారు. సినిమాల్లో బాలనటిగా అడుగుపెట్టి, మెగా హీరో చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర నటులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా, అమెరికాలో క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ కొత్త జీవనవిధానంలో కొనసాగుతోంది.

తమిళనాడులోని తంజావూర్‌కి చెందిన మోహినీ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్, కెరీర్‌ ఆరంభంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. 1991లో తమిళ చిత్రం ఈరమన రోజావే ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, వెంటనే తెలుగులో ఆదిత్య 369లో బాలకృష్ణ సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. అనంతరం డిటెక్టివ్ నారద, మామ బాగున్నావ్, హిట్లర్ వంటి హిట్లలో నటించి దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు.

actress-mohini-chirstina-tollywood-star-heroine-as-christian-preacher

Actress Mohini Chirstina: అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వందకు పైగా సినిమాల్లో నటించిన మోహినీ, కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నాళ్లు సినిమాల్లో నటించినా, తరువాత పూర్తిగా విరమించారు. అంతలోనే భర్తతో విడాకులు తీసుకుని తాను జీవితాన్ని పూర్తిగా మతానికే అంకితం చేశారు. ప్రస్తుతం అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా పలు ప్రోగ్రాముల్లో పాల్గొంటూ గడుపుతున్నారు.

ఇటీవల ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పట్లో స్లిమ్‌గా, గ్లామరస్‌గా కనిపించిన మోహినీ ప్రస్తుతం బొద్దుగా మారిన లుక్‌లో కనిపించారు. 2011లో వచ్చిన మలయాళ చిత్రం కలెక్టర్ ఆమె చివరి సినిమా. ఆ తరువాత మోహినీ సినిమాలకూ, స్క్రీన్‌కూ పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. వెండితెర సుడిగాళి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఒక బోధకురాలిగా మారారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

This website uses cookies.