Actor Vishal : 40 ప్లస్ వయసు వచ్చినా…పెళ్లిళ్ల గురించి ఆలోచించకుండా చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు ,హీరోయిన్ లు తమ కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. సినీ కెరీర్ గురించి ఆలోచిస్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని వదిలేస్తున్నారు . వారి లైఫ్ లో పెళ్లికి అంత ప్రియారిటటీ ఇవ్వడం లేదు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఏదోకటి చెప్పి సైడైపోతున్నారు. ఈ లిస్టులో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. 50 ప్లస్ ఏజ్ లో ఉన్న సల్మాన్ భాయ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్. అలాగే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ వున్నాడు .ఇక సల్మాన్ మరో ఏళ్లు దాటవేస్తే తన ఏజ్ 60 ఏళ్లకు వస్తుంది. దీంతో ఆయన ఇక పెళ్లి చేసుకోకపోవచ్చు.
సల్మాన్ తర్వాత మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నాడు. డార్లింగ్ వయసు ప్రస్తుతం 40 ప్లస్ లో ఉంది. అయితే ఆల్ ఇండియా అందగాడు, అమ్మాయిల క్రేజ్ ఉన్నవాడు కావడంతో మీడియా ప్రభాస్ పెళ్లి కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురుచూస్తోంది. అందుకే సమయం దొరికినప్పుడల్లా పెళ్లి గురించి ప్రశ్నిస్తుంది. అయితే పెళ్లి ఎప్పుడు అడిగిన ప్రతిసారి త్వరలోనే అని సమాధానం ఇస్తూ దాటేస్తుంటాడు. ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ చేశాడు. తజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి అడిగితే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అయ్యింది
హీరో విశాల్ తెలుగువాడైనా తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. తమిళంలో విశాల్ చేసిని అన్ని సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ప్రస్తుతం విశాల్ నటించిన రత్నం మూవీ త్వరలో విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకువస్తున్నాడు. లేటెస్టుగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పెళ్లి ఎప్పుడనే ప్రశ్న విశాల్ కు ఎదురైంది. దీనికి విశాల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ కాగానే అందులోనే పెళ్లి చేసుకుంటా అన్నారు కదా అన్న క్వశ్చన్ కి సమాధానంగా ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటానని విశాల్ సమాధానం ఇచ్చాడు. అంతే కాదు తన పెళ్లి మొదటి శుభలేక ప్రభాస్ కే ఇస్తాను అని చెప్పాడు. దీనితో విశాల్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది.
అయితే అప్పట్లో హీరో విశాల్ కి శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మికి లవ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు పెళ్లి చేసుకునేవరకు వెళ్లినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ అయినట్లు సమాచారం. అంతే కాదు విశాల్కు గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే అది పెళ్లి వరకు వెళ్లలేదు. దీనితో ప్రస్తుతం విశాల్ బ్యాచిలర్ గానే ఉంటున్నాడు. పెళ్లి పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.