Actor Prakash : మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో జివి ప్రకాష్ కుమార్ ఈ మధ్యనే తన భార్య సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు అనౌన్స చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడంతో ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు జీవీ ప్రకాష్ పై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేసారు. తనపై జరుగుతున్న విమర్శలు, ట్రోలింగుపై తాజాగా జీవీ ప్రకాష్ రిప్లై ఇచ్చాడు. చాలా భావోద్వేగంతో కూడిన ఓ ప్రకటనను రిలీజ్ చేశాడు.
“బ్రేకప్ అనేది మా ఇద్దరి అంగీకారంతో జరిగింది. అనవసరమైన ఊహాగానాలతో మమ్మల్ని బాధపెడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం, విడిపోవడం గురించి సరైన అవగాహన లేకుండా ప్రజలు మాట్లాడుకోవడం చాలా నిరుత్సాహంగా ఉంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మరీ అంతలా దిగజారిపోయి మాట్లాడకండి. ట్రోలర్ల వ్యాఖ్యలు సెలబ్రిటీలను ఎంతగా బాధపెడతాయో మీరు గ్రహించలేకపోతున్నారు.
నేను నా భార్య విడిపోవడానికి గల కారణాలు మా ఫ్యామిలీకి, క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇవేవీ మీకు తెలియకుండా ఇష్టమెచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఆ మాటలు నన్ను బాధపెడుతున్నాయి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి అందరి ఎమోషన్స్ కు రెస్పెక్ట్ ఇవ్వండి.ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేసిన వారందరికి ధన్యవాదాలు” అని ఎమోషనల్ నోట్ రాశాడు ప్రకాష్.
మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ అక్క సింగర్ ఎఆర్ రెహనా కుమారుడు ప్రకాష్. సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రకాష్ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగాను ఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్,సైంధవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి 11ఏళ్ల వైవాహిక బంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోతున్నట్లు ఈ ఏడాది మే 13న ప్రకాష్, సైంధవి తమ సోషల్ మీడియాలో డివోర్స్ అనౌన్స్ మెంట్ ను షేర్ చేశారు. వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే చాలా రెస్పెక్టెబుల్ గా మానసిక ప్రశాంతత , ఎదుగుదల కోసం విడిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని గౌరవించి మాకు మీ మద్ధతు అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.