Technology: చాలా మంది ప్రజలు, సినిమాలను అత్యున్నత కళారూపంగా పరిగణిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కళ కూడా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన రచన, కథ, ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కాన్సెప్ట్ ఆర్ట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన అంశాలు ఇప్పటి ఆధునిక సినిమాలో వైవిధ్యతను అందిస్తున్నాయి. ఇవి లేనిదే ఇప్పటి సినిమా పూర్తి కావడం లేదు. అయితే ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం బడా నిర్మాతలే కాదు సినిమాపై అవగాహన ఉన్న వారు సినిమాలు తీస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇవి వెండితెరపై ప్రదర్శించడంలో విఫలమవుతున్నాయి. వీరి కష్టాలను తీర్చేందుకే ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
అయితే వీటిల్లో తమ సినిమా ప్రదర్శించేందుకు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నయా ఫిల్మ్ మేకర్స్ కష్టాలను తీర్చేందుకే వారి ప్రతిభను ప్రదర్శించేందుకూ శాలిభద్ర షా, సిద్ధార్థ్ సిన్హా జైదీప్ అబిచందానీ ABC టాకీస్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. దీనిని ఒక ఓపెన్ యాక్సెస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ గా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చలనచిత్ర నిర్మాతలు తమ చిత్రాలను ఉచితంగా లేదా ఓవర్‌హెడ్‌లతో అప్‌లోడ్ చేయడానికి, పక్షపాతం లేని రేటింగ్‌ను పొందడానికి, వారి నిబంధనల ప్రకారం వారి చిత్రాలను మానిటైజ్ చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్ అనుమతిస్తుంది. దీనికి అదనంగా, ABC టాకీస్ ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు అమ్మకాలు, హక్కుల లైసెన్సింగ్ ద్వారా డబ్బు ఆర్జించడానికి అనుమతిస్తుంది.
సినిమాని మానిటైజ్ చేయడంలో సహాయపడే వివిధ హక్కులను విక్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ కంపెనీ. అదే విధంగా ఇతర OTTలకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా మరింత డబ్బు ఆర్జించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించే చలనచిత్రాల కోసం మొదటి రకం అన్‌బయాస్డ్ రేటింగ్ సిస్టమ్ సేవలను అందిస్తోంది. అధిక స్థాయిలో ప్రాంతీయ కంటెంట్ కే ప్రియారిటీ ఇస్తోంది. ఇదే నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా పరిగనించింది ఈ సంస్థ.
ప్రస్తుతం కంటెంట్ సేకరణ , నెట్‌వర్క్ బిల్డింగ్‌పై దృష్టి సారిస్తోంది ABC టాకీస్. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 270కిపైగా ఫిల్మ్‌మేకర్‌లను ఆన్‌బోర్డ్ చేసింది. అదనంగా, ఫిల్మ్ టెక్ స్టార్టప్ దాని ప్లాట్‌ఫారమ్‌లో 200 లకుపైగా సినిమాలను, 10 నేషన్‌వైడ్ ఛానెల్ పార్ట్‌నర్ షిప్‌లను కలిగి ఉంది. 10 మంది సభ్యుల బృందంతో పని చేస్తున్న ఈ ఫిల్మ్ టెక్ స్టార్టప్‌కు రూ. 2 కోట్ల నిధుల నిబద్ధత కూడా లభించింది, అందులో రూ. 1 కోటి ఇప్పటికే స్టార్టప్‌కు పంపిణీ చేయబడింది.
ఈ స్టార్టప్ కంపెనీ దూకుడుగా విస్తరిస్తోంది. ABC టాకీస్ ను ఆఫ్రికాలో స్థాపించడానికి ఆఫ్రికన్ వ్యవస్థాపకులతో ఒక అవగాహన ఒప్పందాన్ని ఇటీవలె కుదుర్చుకుంది. ABC టాకీస్ తన వార్షికోత్సవ నెలలో దాని మొదటి ఒరిజినల్ ప్రొడక్షన్‌ను ప్రకటించే ప్రక్రియలో ఉంది. రాబోయే సంవత్సరంలో పిల్లల కంటెంట్‌ను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తోంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.