Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలను తినాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో రుచి కోసం ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగించి వంట చేయడం ప్రారంభిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకున్న వారు అవుతాము.ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను కనుక ఎక్కువగా ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి
మన ఆరోగ్యానికి అంత నష్టం కలిగించే వంటింటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి వంటింట్లో లభించే వాటిలో ఉప్పు ఒకటి ఉప్పు ఉంటేనే మనం తినే ఆహార పదార్థాలకు రుచి ఉంటుంది. అయితే ఉప్పు మన శరీరంలో మోతాదుకు మించితే మన ఆరోగ్యానికి ప్రధాన శత్రువుగా మారుతుంది. వంటకాల్లో రుచికోసం టేస్టీ సాల్ట్, మసాలా దినుసులను ఎక్కువగా వినియోగిస్తే
రక్తంలో సోడియం పరిమాణం పెరిగి అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. దీంతో గుండెపోటు సమస్యలు కూడా అధికమవుతాయి. ఎప్పుడైతే సోడియం శాతం ఎక్కువగా ఉంటుందో అప్పుడు కిడ్నీలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి.
Health Tips
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా ఫ్రైడ్ రైస్ తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల వంటనూనెలను మోతాదుకు మించి ఆహారంలో తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉబకాయం, డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు ప్రమాదాలు పెరిగిపోతాయి.
రోజువారి ఆహారంలో మైదా పిండితో తయారు చేసే బ్రెడ్, పరోట, పిజ్జా ,బర్గర్ వంటివి ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని అనేక సర్వేలో వెళ్లడైంది.మైదాపిండినీ అధికంగా చేసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడంలో ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా మలబద్ధక సమస్యలు,ఉదర సంబంధిత క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఉప్పు కారం మసాలా పొడులు ఉపయోగించకుండా తినడమే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.