Holi: ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక అంటే హోలీ అని చెప్పాలి. భారతీయ సనాతన ధర్మంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. దీనిని హిందువులు చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వేడుక ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. హిరణ్యకశిపుడి మరణం తర్వాత ప్రజలందరూ ఆ అసురుడి కష్టాల నుంచి బయటకి వచ్చినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుపుకుంటారు అని ప్రతీతి. అలాగే హోలిక అనే రాక్షసి సంహారానికి గుర్తుగా ఆమె పేరు మీద హోలీ వేడుకలు జరుపుకుంటారు అని మరో కథ కూడా ప్రాచూర్యంలో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హోలీ వేడుక కాశిలో మాత్రం రంగులతో కాకుండా శవాలని కాల్చిన బూడిదతో జరుపుకోవడం ఆనవాయితీ. వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం వస్తుంది. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహాపట్టణం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనంది అని అందరికి తెలిసిందే. ఇక్క మరణం పొందడం కూడా ఎంతో పుణ్యఫలంగా భావించే వారు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలా బూడిదతో జరుపుకునే హోలీని మసానే కీ హోలీ అని అంటారు. సాక్షాత్తు పరమశివుడు ఈ వేడుకని ఇక్క స్టార్ట్ చేసాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇదిలా ఉంటే మణికర్ణిక ఘాట్ లో ఈ మాసాన్ కీ హోలీ వేడుకని జరుపుకుంటారు.
పరమశివుడు మరణం తర్వాత మనిషి ఆత్మలతో అక్కడ హోలీ ఆడాడని ప్రతీతి. ఇక ఈ హోలీ వేడుకని హరహర మహాదేవ అనే కీర్తనల నడుమ సంకీర్తలు చేస్తూ సామాన్య ప్రజల తో పాటు అఘోరాలు, సన్యాసులు ఈ వేడుకని జరుపుకుంటారు. ఇలా చేయడం వలన పరమశివుడికి కృపకి పాత్రులు అవుతారని నమ్మకం. అలాగే జీవితపు చివరి మజిలీ కూడా అదే అనే సత్యాన్ని తెలియజేయడానికి స్మశానంలో చితాభస్మంతో హోలీ వేడుకని ఆడుతారని తెలుస్తుంది.