Health: ఈ రోజుల్లో మనం తినే ఆహారం, బయటి వాతావరణం ఎంతగా కలుషితం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కాస్తంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వకాలం ఆహారపు అలవాట్లని మరల కొత్తగా మన రోజువారి జీవితంలోకి తెచ్చుకోవాలి. సహజసిద్ధ ఆహార పదార్ధాల కారణంగా ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో ఆయుర్వేదం ఎంతో గొప్పగా చెప్పింది. గతంలో మన పూర్వీకులు ఎలాంటి రోగాన్ని అయిన ఆయుర్వేద వైద్యంతోనే నయం చేసేవారు.
అయితే ప్రస్తుతం వచ్చిన అల్లోపతి వైద్యం ఉన్న జబ్బుని పోగొట్టి కొత్త జబ్బుని తీసుకొస్తుంది. దీంతో నిత్యం ఏదో ఒక రోగంతో మందు బిళ్ళలు మింగాల్సి వస్తుంది. అయితే మన ఆరోగ్యం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని అంటున్నారు ప్రకృతి, ఆయుర్వేద వైద్య నిపుణులు మన ఆహారపు అలవాట్లు మార్చుకొని జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటంతో పాటు మన ఇంట్లో వంటకాల్లో వాడే పదార్ధాలతోనే నిండైన ఆరోగ్యం పొందవచ్చు అని చెబుతున్నారు.
జంక్ ఫుడ్స్ కారణంగా, అలాగే శారీరక శ్రమ లేకపోవడం వలన ఒంట్లో కొలెస్టరాల్ పెరిగిపోయి చాలా మందికి చిన్న వయస్సులోనే ఊబకాయం వచ్చేస్తుంది. అలాగే కొవ్వు పేరుకుపోయి విపరీతంగా లావైపోతున్నారు. ఇలా ఒంట్లో కొలెస్టరాల్ కారణంగా రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతిని గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు ఫెయిల్ కావడం, ఒబీసీటీ, గుండెపోటులు చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్షీణించి చాలా వేగంగా మనం రోగిన పడుతున్నాం.
ఇక వీటికోసం మంచి ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి. వాటిలో చాలా మంది ఇష్టంగా తినే మునగ కాయలు వచ్చే చెట్టు ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుని ఇప్పుడైతే పెద్దగా ఎవరూ వాడటం లేదు కాని ఒకప్పుడు ఈ మునగ ఆకుతో పొడి తయారు చేసుకొని దానిని అన్నంలో కలుపుకొని తినేవారు. ఈ ఆకు ఒంట్లో కొలెస్టరాల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మునగాకు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే అధిక రక్తపోటుని ఈ ఆకు కంట్రోల్ చేస్తుంది. అలాగే బరువు తగ్గాలని అనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే మునగాకు రసాన్ని తాగితే వేగంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.