Dragon Fruit: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు డ్రాగన్ ఫ్రూట్స్ చాలా విరివిగా లభిస్తున్నాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండించే వారి సంఖ్య అధికమవుతుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చిన్నపిల్లలకు మనం తినిపించవచ్చా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే చిన్నపిల్లలకు డ్రాగన్ ఫ్రూట్స్ తినిపిస్తే ఏం జరుగుతుంది ఏంటి అనే విషయానికి వస్తే..
చిన్నపిల్లలకు ఎలాంటి సందేహాలు లేకుండా డ్రాగన్ ఫ్రూట్స్ తినిపించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లలో ఎంతో పుష్కలంగా పోషక విలువలు దాగి ఉన్నాయి.కనుక చిన్నపిల్లలకు తినిపించడం ఎంతో మంచిది.డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో దోహదం చేస్తుంది.డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పిల్లలలో వచ్చే మలబద్ధక సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది.డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి పిల్లల్లో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక చిన్న పిల్లలు చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతో సహాయం చేస్తుంది. ఈ పండును తినటం వల్ల చర్మ సమస్యలు అలర్జీలు కూడా తొలగిపోతాయి. ఇందులో లభించే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల చర్మాన్ని రక్షించడంలో దోహదం చేస్తాయి.