Ganesh Immersion: వినాయక చవితి వేడుకలను ప్రతి ఏడాది భాద్రపద మాసంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలో భాగంగా చవితి రోజు విగ్రహాలను ఏర్పాటు చేస్తే చాలామంది వారికి అనుగుణంగా మూడు రోజులకు ఐదు రోజులకు లేదా తొమ్మిది రోజులకు విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఇలా వినాయక చవితి తర్వాత విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో చేయకపోతే ఏం జరుగుతుందనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి వినాయక చవితి తర్వాత నిమజ్జనం ఎందుకు చేస్తారనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో మనం ఎన్నో రకాల పత్రాలను ఉపయోగిస్తాము సుమారు 21 పత్రాలను ఈ పూజలు ఉపయోగిస్తాము అయితే ఆ పత్రాలన్నీ కూడా ఎన్నో ఆయుర్వేద మూలికలతో కొలువై ఉన్నవి అందుకే అలాంటి పత్రాల ద్వారా వినాయకుడిని నిమజ్జనం చేయటం వల్ల ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో వైరల్ , బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఆ తర్వాత ఈ పత్రిలు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. తద్వారా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.
సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించిన తర్వాత … ఎవరికి వీలైనన్ని రోజులు పూజలందించి నిమజ్జనం చేస్తారు. ఇక నిమజ్జనం చేయని వారు ఉద్వాసనం చెప్పి పక్కన పెట్టేస్తారు. అయితే మనం పూజలో తీసుకున్న వినాయకుడి విగ్రహాలను ఎత్తు బట్టి మన ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు నైవేద్యాలు చేయాల్సి ఉంటుంది కనుక చాలామంది ఈ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వీలైనంతవరకు వినాయక చవితి వేడుకలలో భాగంగా ఇంట్లో ప్రతిష్టించే విగ్రహాలు చాలా వరకు చిన్నవిగా ఉంటేనే మంచిది.