Tholi Ekadashi: మన హిందువుల పండుగలను కూడా ఏకాదశి తోనే ప్రారంభమవుతాయి అయితే ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 17వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాము. ఈ తొలి ఏకాదశి రోజు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని అదేవిధంగా ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. అందుకే తొలి ఏకాదశి రోజు శ్రీహరికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఉపవాసం ఉంటారు..ఈ రోజు పాలకడలిలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తారని విశ్వాసం. ఇక ఈ రోజు నుంచి హిందువుల పండగలు మొదలవుతాయి.
ఈరోజు మనం ఒక చిన్న పూజ చేస్తున్న లేదంటే ఉపవాసం ఉన్న 1000రెట్ల ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే తొలి ఏకాదశి రోజు వివాహం ఆలస్యం అయ్యేవారు జాతకంలో దోషాల కారణంగా వివాహం కుదరని వారు ఈరోజు శ్రీహరికి ఇలా పూజ చేస్తే దోషాలు తొలగిపోయి వివాహం కుదురుతుందని పండితులు చెబుతున్నారు. ఇక తొలి ఏకాదశి రోజు ఉదయం నిద్ర లేచి తలంటూ స్నానం చేసి అనంతరం ఇంటిని శుభ్రం చేసే శ్రీహరికి ప్రత్యేకంగా పూజలు చేసి పూజించాలి.
ఇక ఈరోజు ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఇక శ్రీహరిని పూజించే సమయంలో తప్పనిసరిగా తులసిమాలతో పూజించాలి అలాగే నైవేద్యంలో కూడా తులసి ఆకులను సమర్పించడం ఎంతో శుభకరం. ఇక వివాహ ప్రయత్నాలు ఫలించకపోతే తొలి ఏకాదశి రోజున యువతీ యువకులు రుక్మిణి కల్యాణాన్ని 11 సార్లు చదివితే శుభ ఫలితం ఉంటుందని..నెల తిరిగే సరికి వివాహం కుదురుతుందని నమ్మకం. అదేవిధంగా ఈరోజు దానధర్మాలు చేయడం మంచిది గోవుకు గడ్డి వేయటం వల్ల కూడా ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.