Mahasivarathri: మన హిందువులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి మహాశివరాత్రి రోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శివరాత్రి పండుగ రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించి చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ విధంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఎలాంటి పదార్థాలను తినాలి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉపవాస దీక్ష చేయాలని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే శివరాత్రి పండుగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 8వ తేదీ వచ్చింది దీంతో మార్చి 8వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఉదయమే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను పూజించిన తరువాత ఉపవాస దీక్షను చేయాలి అయితే ఉపవాసం ఉన్నవారు కొన్ని పండ్లను తీసుకోవచ్చు మరి ఎలాంటి పండ్లు తినాలి అనే విషయానికి వస్తే..
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు నారింజ అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినవచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి మద్యం ఆల్కహాల్ వంటి వాటిని అసలు ముట్టుకోకూడదు ఇలా ఉపవాసం ఉన్నవారు ఈ జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం.