Vastu Tips: సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు చిన్న పిల్లలు చూడటానికి ఎంతో ముద్దుముద్దుగా ఉంటారు. అంతేకాకుండా వారు చేసే అల్లరి పనులు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇలా చిన్న పిల్లలు అందరి దృష్టిలో పడటం వల్ల వారికి తొందరగా చెడు దృష్టి పడుతుంది.
ఇతరుల చెడు ప్రభావం కూడా వారిపై పడటం వల్ల పిల్లలలో నలతగా ఉండడం జరుగుతుంది తరచూ వాంటింగ్స్ కావడం వళ్ళు వేడి కావడం వంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.ఇలా చిన్న పిల్లలకి కనక దిష్టి తగలడం వల్ల వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా దిష్టి నుంచి బయట పడాలి అంటే ఇలా చేస్తే సరిపోతుంది. పిల్లలకు నలుపు రంగు దారం కాలికి కట్టడం వల్ల తొందరగా చెడు దిష్టి ప్రభావానికి గురికారు.
అదేవిధంగా ఎండుమిరపకాయలు ఉప్పును తీసుకొని ఐదుసార్లు అటు ఇటు దిగదీసి దానిని మంటలలో వేయటం వల్ల కూడా పిల్లలు దిష్టి నుంచి బయటపడతారు. ఇక పిల్లలు దిష్టికి గురికాకుండా ఉండాలి అంటే వారికి నలుపు రంగు పెద్ద సైజులో బొట్టు పెట్టడం వల్ల అందరి దృష్టి ఆ బొట్టు పైకి వెళుతుంది కానీ పిల్లల పైకి వెళ్ళదు కనుక దిష్టి తగలదు.