YSRCP: ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొత్త టెన్షన్ మొదలవుతుంది. సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయనే ఆశతో పూర్తిగా జగన్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టారు. రహదారులు, ఉద్యోగం, ఉపాధి, విషయంలో ప్రజలకి ఇచ్చిన హామీలని పూర్తిగా విస్మరించారు. అలాగే మద్యపాన నిషేధం అనే అంశాన్ని పక్కన పెట్టి ధరలు పెంచేసి మరింత ఎక్కువ ఆధారం సంపాదిస్తున్నారు. అయితే సంక్షేమం, పథకాల పేరుతో ప్రతి నెల ఏదో ఒక రూపంలో మహిళల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నారు. ఇలా డబ్బులు వేసిన ప్రతిసారి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.
అయితే ఒకే స్పీచ్ ని పదే పదే మాట్లాడుతూ ఉండటంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తోన్న మాట. అలాగే గ్రౌండ్ లెవల్ లో గ్రామ సారథులని ఏర్పాటు చేసి ఇంటింటికి పంపించి సంక్షేమంపై ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ జీతం ఇచ్చే వాలంటీర్లని కూడా వైసీపీ తమ ప్రచారం కోసం ఉపయోగించుకుంటుంది. ఇవన్ని గెలుపు వ్యూహంలో సాగుతూనే ఉన్న ముఖ్యమంత్రి జగన్ టీమ్ కి ఏదో భయం వెంటాడుతూనే ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. దీనికి కారణం పార్టీలోనే అసంతృప్తి నేతలు పెరిగిపోవడం. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు అంటూ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ దూరం చేసుకుంది.
ఇప్పుడు పార్టీలో బయట పడకపోయిన చాలా మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమందికి సీట్లు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ తేల్చేశారు. సమీకరణాలు, అలాగే ఐప్యాక్ సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వచ్చే ఎన్నికలలో అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాసరావు మొన్నటి వరకు తనకి టికెట్ లేదని చెప్పారు. అయితే సడెన్ గా ఒంగోలు నుంచి వైసీపీ తరపున మళ్ళీ పోటీ చేస్తానని అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా ప్రకటించేశారు. అలాగే చాలా మంది సొంత అజెండాతో పనిచేస్తున్నారు. ఇలా 50 నుంచి 70 మంది వరకు ఉన్నారని అంచనా. ఎన్నికల ముందు వారు పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.