Ys Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రానున్న ఎన్నికలలో ప్రజలకి చేరువ అయ్యి మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తనకున్న అన్ని అవకాశాలని వాడుకొని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 14 స్థానాలకి మార్చి నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లతో పాటు మరికొన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు స్థానిక సంస్థలలో గెలిచినా అందరూ ఓటింగ్ వేస్తారు. ఈ ఎన్నికలలో అన్ని స్థానాలని వైసీపీ సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని జగన్ చూస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కొంత మంది సమర్దవంతంగా బాద్యతలు నిర్వహించడం లేదని, కనీసం పోర్ట్ ఫోలియో మీద కూడా కనీసం అవగాహన లేదని జగన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ప్రజలలోకి వెళ్ళకుండా పేరుకే నామమాత్రంగా మంత్రిగా ఉన్నారు తప్ప వారు ఏమీ చేయడం లేదని జగన్ దగ్గర రిపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది.
అలాగే వచ్చే ఎన్నికలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కూడా సీట్లు ఇచ్చే అవకాశం లేదని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. అలాంటి వారిని మంత్రిపదవి నుంచి తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా అయ్యేవారిలో ఒకరిద్దరికి మంత్రిగా అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏప్రిల్ లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కొంతమందిని ప్రభుత్వ బాద్యతల నుంచి తప్పించి పార్టీ బాద్యతలు అప్పగించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ మంత్రివర్గ కూర్పులో మార్పులు జరగనున్నాయి అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.