YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి వ్యవహారంలో నేడు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించి చంచల్ గూడా జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందించారు.

హైదరాబాద్‌ లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ, ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినప్పటికీ అతనిపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టు చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను..అని జగన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

ys-jagan-mohan-reddy-ys-jaganmohan-reddys-post-on-allu-arjuns-arrest-goes-viral
ys-jagan-mohan-reddy-ys-jaganmohan-reddys-post-on-allu-arjuns-arrest-goes-viral

YS Jagan Mohan Reddy: శనివారం, ఆదివారం కోర్టులకి సెలవులు ఉంటాయి

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ కేసును చేపట్టిన ప్రముఖ న్యాయమూర్తులు అల్లు అర్జున్ ని బయటకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా, ఇప్పుడు అంతటా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ కి ఎంత లేదన్నా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈరోజు శుక్రవారం కావడంతో శనివారం, ఆదివారం కోర్టులకి సెలవులు ఉంటాయి కాబట్టే అరెస్ట్ కి ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago