AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు వచ్చేస్తాయి అన్నంతగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏకంగా 175 నియోజకవర్గాలలో గెలిచి అధికారంలోకి రావాలని వైయస్సార్సీపి భావిస్తూ ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా రానున్న ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అనే పంతంతో ఉంది. దీనికోసం అవసరమైన విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఆ పార్టీకి నూతన ఉత్తేజం అందించింది.
ఇదే ఊపులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దూసుకుపోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలమైన ఓటు బ్యాంకు సొంతం చేసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరాల్సిందే అనే ఆలోచనతో వ్యూహాలను అమలు చేస్తున్నారు. కుదిరితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం లేదంటే ఒంటరిగా పోటీ చేసి వీలైనంత ఎక్కువ స్థానాల్లో గెలవడం జనసేన ముందున్న లక్ష్యం. తద్వారా అధికారంలో భాగస్వామ్యం కావడం ముఖ్యమంత్రి పీఠంపై పవన్ కళ్యాణ్ కూర్చోవాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజులు వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. దీని వెనుక జగన్ వ్యూహాత్మక ఆలోచన ఉందనే మాట వినిపిస్తుంది. బిజెపి పార్టీని దగ్గర చేసుకోవడం తద్వారా రానున్న ఎన్నికలలో వారి సహకారంతో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అలాగే ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచనని కూడా కేంద్రంలోని పెద్దలతో పంచుకొబోతున్నారు అని తెలుస్తుంది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కోరనున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.