YS Vivek Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 ఎన్నికలకి కొద్ది రోజుల ముందు జరిగింది. ఈ హత్యని వైసీపీ తనకి అనుకూలంగా మలుచుకోవడంతో పూర్తిగా సఫలం అయ్యిందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగినట్లుగా వైసీపీ నాయకులు ప్రాజెక్ట్ చేశారు. స్వయానా వైఎస్ జగన్ సైతం టీడీపీ కుట్రపూరిత హత్యగానే పరిగణించారు. నారాసుర రక్తచరిత్ర అంటూ అప్పట్లో సాక్షిలో ఫ్రంట్ పేజీ స్టొరీనే దీనిపై వైసీపీ ప్రచారం చేసింది. ఏపీ ప్రజలు కూడా ఇది నిజమని నమ్మారు. ఈ కేసు జగన్ ని అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడింది.
ఇక అధికార పీఠంపై జగన్ కూర్చున్న తర్వాత వివేకానంద హత్య కేసుపై సిట్ విచారణకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ దర్యాప్తు ముందుకి సాగకపోవడంతో వైఎస్ వివేకా కూతురు సీబీఐ ఎంక్వయిరీ కావాలని హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే హత్య జరిగి నాలుగేళ్ళు అవుతున్న హంతకులు ఎవరనేది ఇంకా తేలకపోవడం, కేసు విచారణలో కాలయాపన జరుగుతూ ఉండటంతో మరల వివేకా కూతురు ఈ కేసులో హైకోర్టుని ఆశ్రయించారు. తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు భిగించుకోవడం మొదలైంది.
ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకి పిలిచిందో అప్పటి నుంచి వైఎస్ వివేకా కేసులో వైసీపీ శ్రేణులు కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వివేకా వివాహేతర సంబంధం, రెండో భార్యతో ఆర్ధిక లావాదేవీలు వంటి వాటిని హైలైట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో గ్రూప్స్ లో కూడా వీటిని ఫోకస్ చేసి ప్రచారం చేయించారు. అదే సమయంలో ఈ కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న సునీతపైన కూడా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. అందులో భాగంగా తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే వివేకా చనిపోయిన తర్వాత గాయాలకి కుట్లు వేసిన డాక్టర్ ఉదయ్ భాస్కర్ ని అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి పీఏని అరెస్ట్ చేశారు. వివేకా హత్యకి ముందు, ఆ తరువాత భాస్కర్ రెడ్డితో వారు కలిసి మాట్లాడారని, అతని సూచనల ప్రకారమే నడుచుకున్నారని సీబీఐ అభియోగాలు మోపి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసులో నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదనే మాట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. అలాగే జగన్ ప్రమేయం కూడా ఇందులో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు సీబీఐ భాస్కర్ రెడ్డి తప్పుడు అభియోగాలతో అరెస్ట్ చేసింది అంటూ నిరసనలు తెలియజేస్తూ ఉండటం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.