Politics: ఎన్నికల సమయాలలో కొంత మంది దూర ప్రాంతాలలో ఉండి తమ ఓటుని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలలో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాలకి వలస పోతారు. వారు ఎన్నికలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే ఉద్యోగాలు చేసే వారు కూడా దూర ప్రాంతాలలో ఉంటూ ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్ళాలంటే ఖర్చులు లెక్కపెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ కారణంగా ఇండియాలో అసెంబ్లీ ఎన్నికలలో సరాసరి 60 నుంచి 70 శాతం మాత్రమే ఓట్లు నమోదు అవుతాయి. అయితే మిగిలిన 30 శాతం కూడా ప్రజలు ఓట్లు వినియోగించుకుంటే పోటీ చేసే నాయకుల భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుంది.
ఈ 60 శాతం పోలింగ్ లో కొంత మంది పదులు నుంచి వందల సంఖ్య ఓట్ల మార్జిన్ తో గెలుస్తారు. అయితే ఎన్నికలలో ఇకపై ఎక్కడి నుంచి అయినా ఓట్లు వేసుకునే విధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మిషన్ ని ముందుగా ఐదు రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక జనవరి 16న ఈ కొత్త టెక్నాలజీ మిషన్ ని ప్రదర్శనకి ఉంచబోతున్నారు. ఇక ఈ మిషన్ పనితీరు, ప్రదర్శనని తిలకించడానికి అన్ని పార్టీలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఇక పార్టీల అభిప్రాయం మేరకు దీనిని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వేళ పార్టీలు ఏవైనా మార్పులు సూచిస్తే వాటికి అనుగుణంగా కూడా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక పార్టీల అంగీకారంతో ఈ మిషన్ ని ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలోకి తీసుకొస్తామని తెలిపారు. దీని ద్వారా ఓటర్ ఎక్కడ ఉంటే అక్కడ పోలింగ్ బూత్ కి వెళ్లి రోమోట్ సిస్టమ్ తో తన నియోజకవర్గానికి సంబందించిన డేటాతో కనెక్ట్ అయ్యి నచ్చిన వారికి ఓటు వేసే సౌలభ్యం ఉంటుంది. ఇది విజయవంతం అయితే మాత్రం దేశంలో కచ్చితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు ప్రజలు కూడా నిరంభ్యంతరంగా తమకి నచ్చిన అభ్యర్దులకి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే టెక్నాలజీ కాబట్టి హ్యాకింగ్ తో ఏదో ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు పడే విధంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సెన్సార్ మోనిటరింగ్ ద్వారా మరింత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.