Kotamreddy: వైసీపీ అధిష్టానంతో విభేదించి బయటకి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ముప్పేట దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కోటంరెడ్డిపై విమర్శలు చేస్తూ ఉంటే మరో వైపు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు దారుణంగా బూతులతో రెచ్చిపోతున్నారు. అలాగే ఇన్ని రోజులు గొప్పగా పిగిడేసి ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు వీడియోలు సృష్టించి నియోజకవర్గంలో కోటంరెడ్డిపై దుష్ప్రచారానికి తెరతీసారు. తాజాగా జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎవరైనా విమర్శలు చేస్తే ఫోన్ చేసి బోరుగడ్డ అనీల్ అనే వ్యక్తి తీవ్ర దుర్పాషలు ఆడుతూ బూతులతో రెచ్చిపోతాడు. ఏకంగా చంపేస్తాం, నరికేస్తాం అంటూ హెచ్చరిస్తూ ఉంటాడు.
గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా కూడా పవర్ స్టార్ ని లక్ష్యంగా చేసుకొని ఏకంగా బెదిరింపులకి పాల్పడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వీడియోలో విశాఖలో అడుగుపెడితే నరికేస్తాం అంటూ బోరుగడ్డ అనీల్ మాట్లాడారు. అయితే దీనిపై జనసైనికులు పోలీసులకి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ దాడి చేశాడు. దీనికి సంబందించిన `ఆడియోని కోటంరెడ్డి బయటపెట్టారు.
ఇలా బోరుగడ్డ అనీల్ అనే వ్యక్తి ఫోన్ చేసి నెల్లూరు నడిరోడ్డు మీద బండికి కట్టేసి కొట్టుకుంటూ తీసుకొని వెళ్తాం అంటూ బెదిరించాడని మీడియాకి చెప్పారు. అతను ఎవరనేది ఎంక్వయిరీ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ అని తేలిందని తెలిపారు. ఇక ఆ వీడియోలు కోటంరెడ్డి జగన్ ని తానూ ఏమీ అనలేదని చెబుతున్న కూడా వినకుండా బెదిరింపులకి పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఆడియోని కోటంరెడ్డి బయటపెట్టడంతో ఇప్పుడు వైసీపీ మరింత డిఫెన్స్ లో పడినట్లు అయ్యింది. ఇలాంటి వారు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.