White Rice: మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము ఏదైనా ఫలం లేదా మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి తీపి పదార్థాలను కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యంగా చాలామంది తెల్ల అన్నం కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇలా తెల్ల అన్నం సమర్పించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయనే పండితులు చెబుతున్నారు. మరి తెల్ల నైవేద్యంగా సమర్పించ కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం…
పూజ తర్వాత దేవుడికి నైవేద్యంగా తెల్ల అన్నం సమర్పించడం వల్ల మన ఇంట్లో సంపాదకు ఏమాత్రం లోటు ఉండదు ఇలా సమర్పించినటువంటి నైవేద్యాన్ని మరుసటి రోజు ఆవుకు తినిపించడం మంచిది. ఇక చాలామంది తెల్ల అన్నంలోకి నెయ్యి వేసి కూడా దేవుడికి నైవేద్యం పెడతారు. ఇలా నెయ్యితో కలిపిన అన్నం దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల వారికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే శనగపప్పు పాయసం చేసి తెల్ల అన్నంలో కలిపి కుల దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో మనశ్శాంతితో ఉంటారు.
ఇక తెల్లని అన్నంలోకి నల్లని నువ్వులను కలిపి శనీశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అలాగే కాకులకు పెట్టడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి శని పితృ దోషాలు ఉండవు. ఇక తెల్లటి అన్నంతో శివలింగాన్ని తయారుచేసి శివలింగాన్ని పూజించిన తరువాత ఆ శివలింగం పారుతున్నటువంటి నీటిలో వేయటం వల్ల మన ఇంట్లో సంపదలకు లోటు ఉండదని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.