World cup 2023 : క్రికెట్ అంటే అందరికీ పిచ్చి. మన ఫేవరెట్ స్టార్స్ మైదానంలో చేసే రచ్చను చూసి మామూలుగా ఎంజాయ్ చేయరు క్రికెట్ అభిమానులు. సిక్స్ లు ఫోర్లు కొడుతుంటే అబ్బబ్బా, ఆ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇక అదే వరల్డ్ కప్ అయితే ఆ మజానే వేరు. మన ఇండియన్ టీమ్ ప్రత్యర్థి టీంతో తలపడే దృశ్యాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఇక భారత క్రికెట్ ప్లేయర్లలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. విరాట్ ఫీల్డ్ లో తన బ్యాటితో చేసే విన్యాసాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వార్మ్ మ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కానీ ఏమైందో ఏమిటో విరాట్ ఉన్నట్లుండి ముంబై వెళ్ళిపోయాడు. టీమ్ ఇండియాకు దూరమయ్యాడు.
ప్రపంచ కప్ మ్యాచుల్లో భాగంగా భారత్ టీమ్ వార్మమ్ మ్యాచ్ లు ఆడుతుంది. మంగళవారం నెదర్లాండ్స్ తో రెండో వార్మప్ మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. తన టీంతో కలిసి తిరువనంతపురం రాలేదు. విరాట్ సడెన్గాముంబై వెళ్ళాడు. బీసీసీఐ పర్మిషన్ తో లీవ్ తీసుకున్నాడు. అయితే విరాట్ ఎమర్జెన్సీ గా పర్సనల్ కారణాల వల్ల ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది.
అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విరాట్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. విరాట్ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. విరాట్ వైఫ్ అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ కారణంగా రీసెంట్ గా హాస్పిటల్ వెళ్లినట్లు న్యూస్ వచ్చింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ముంబై వెళ్లడం తో ఈ వార్తకు మరింత ప్రచారం పెరిగింది . 2017లో విరాట్, అనుష్క వివాహం చేసుకున్నారు. 2021లో అనుష్క వామికకు జన్మించింది.మరి రేపటి మ్యాచ్ కు విరాట్ వస్తాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అదే విధంగా ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.