Bhola Shankar : మెగా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న సిస్టర్ సెంటిమెంట్..?

Bhola Shankar : మెగా ఫ్యాన్స్‌ను సిస్టర్ సెంటిమెంట్ భయపెడుతున్నతుందా..? అవుననే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎందుకంటే మెగా హీరోలు ఈ మధ్యకాలంలో చేసిన సిస్టర్ సెంటిమెంట్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకోవడమే. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన అన్నవరం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తమిళంలో మంచి హిట్ సాధించిన కథను పవన్ కళ్యాణ్ తెలుగులో అన్నవరం అంటూ చేశారు. ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో బ్రూస్‌లీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఇందులో కృతి కర్బంద చరణ్‌కి అక్క పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగానే రూపొందించారు. అప్పటికే శ్రీనువైట్ల ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమా కూడా అదే లిస్ట్‌లో చేరింది. అంతేకాదు, చరణ్‌కి సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.

Bhola Shankar : ఇప్పట్లో అన్నయ్యని ఆపడం ఎవరివల్లా కాదు.

మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ అంటూ ఇదే సిస్టర్ సెంటిమెంట్ కథాంశంతో మూవీ చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్‌కి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా ఆయనకి చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ సందడి చేయబోతోంది. ఈ మూవీ పోస్టర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటి మీద అంత ఆసక్తి కలగలేదనే చెప్పాలి. ఇప్పటికే మన సౌత్‌లో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా చాలా సినిమాలొచ్చాయి. వాటిలో సగానికి పైగా ఫ్లాప్ చిత్రాలే.

అంతెందుకు ఇదే సిస్టర్ సెంటిమెంట్‌తో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అణ్ణాత్త అనే సినిమా చేసి ఫ్లాప్ చూశారు. ఇందులో ఆయనకి చెల్లిగా నటించింది కీర్తి సురేశ్. ఇదే భోళా శంకర్ మూవీకీ రిపీట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అన్నయ్య సాలీడ్ హిట్ కొట్టారు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్ళు రాబట్టారు. ఇదే కంటిన్యూ అయితే ఇప్పట్లో అన్నయ్యని ఆపడం ఎవరివల్లా కాదు. కానీ, సిస్టర్ సెంటిమెంట్ గనక రిపీట్ అయితే చెప్పలేము.

Bhola Shankar : కీర్తి సురేశ్ భోళా శంకర్‌కి మైనస్ అవుతుందా..?

మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ కీర్తి సురేశ్ ఖాతాలో హిట్ అనేది చేరలేదు. ఎలాంటి ప్రయోగాత్మక చిత్రం చేసినా పేరు తప్ప కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. ఒకరకంగా చెప్పాలంటే కీర్తి సురేశ్ ఉన్న సినిమా ఫ్లాప్..అనే స్టాంప్ పడిపోయింది. గత చిత్రం సర్కారు వారి పాటపై కీర్తి ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఎవరూ ఊహించనంతగా ఎక్స్‌ఫోజింగ్ కూడా చేసింది. అయినా అమ్మడికి ఫ్లాప్ తప్పలేదు. ఇది కూడా నెగిటివ్ సెంటిమెంట్ అవుతుందా..? అనే సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ బ్రేక్ చేస్తూ మెగాస్టార్ గనక భోళా శంకర్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తే ఈ కామెంట్స్ అన్నీ గాల్లో కొట్టుకుపోతాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 days ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 days ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 days ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

5 days ago

Kalki 2898 AD Sequel: సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్!

Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…

1 week ago

Puranapanda Srinivas: తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…

2 weeks ago

This website uses cookies.