Lavanya Tripathi : మెగా హీరోతో లావణ్య త్రిపాఠి పెళ్ళి..ఈ ఏడాదేనా..?

Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకూ సరైన స్పష్ఠత రాలేదు. ఇటీవలే మంచు వారబ్బాయి మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యామిలీ హీరోలపై సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఒకవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తుంటే మరొకవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుందని ఈ మధ్య బాగా వార్తలు వచ్చి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే, దీనిపై లావణ్య క్లారిటీ ఇచ్చింది. అలాగే, వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్స్ అని తేల్చిపారేశారు. అయినా మళ్ళీ ఇదే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. నేను వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని..ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా ఎందుకు ఇలాంటి పిచ్చి గాసిప్స్ రాస్తున్నారో అంటూ ఓపెన్ అయింది. మరోసారి తనకీ వరుణ్ తేజ్‌కి పెళ్లి అనేది సోషల్ మీడియాలో క్రియెట్ చేసిన వార్తే అని తేల్చేసింది. ఇక గతంలో ఇదే విషయంలో నాగబాబు కూడా ఇవన్నీ పనికిమాలిన వార్తలంటూ కొట్టిపారేశారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.