Chiranjeevi: చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా?..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ మొదలైంది. ఇప్పటి వరకూ దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడలేదు. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచినవే. ముఖ్యంగా వెంకటేష్‌కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. వెంకీతో ఉన్న సక్సెస్ ట్రాక్ మాత్రమే కాదు, అనిల్ రావిపూడి సినిమాలను చూసి చిరు ఛాన్స్ ఇచ్చాడు.
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆశించిన విజయాలేవీ దక్కడం లేదు. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య మాత్రమే చిరు నుంచి వచ్చిన సినిమాల్లో హిట్ సాధించాయి. దాంతో, మెగాస్టార్‌తో సినిమా చేసిన దర్శకులు ఫ్లాప్‌ని చూశారు. అయితే, చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు.
Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుంది
అనిల్ రావిపూడి సినిమాలు కొంత ఆడియన్స్‌కి రొటీన్ అనే ఫీలింగ్ వచ్చింది. అదే కామెడీ..అలాంటి కథలే..అనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణకి భగవంత్ కేసరి సినిమాతో హిట్ ఇవ్వడమే కాదు, ఈ సినిమా కథ, మేకింగ్ పరంగా అనిల్ రావిపూడి మార్క్ కాకుండా బాలయ్య మార్క్ అండ్ ఇమేజ్ కనిపిస్తుంది. అలాంటి కథలు గనక అనిల్ రావిపూడి చేస్తే ఇంకొన్నేళ్ళపాటు సక్సెస్‌లతో సాగుతాడు.
ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది..మెగాస్టార్‌తో చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుంది అని. రొటీన్ గా ఏమాత్రం అనిపించినా ఫలితం గ్యారెంటీగా ఆశించిన విధంగా రాకపోవచ్చు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ ఈ సినిమా సక్సెస్ గురించే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.