Homeopathy: జలుబు ఉన్నా, దగ్గు వచ్చినా, జ్వరం అయినా కాళ్ల నొప్పుల నుంచి తల నొప్పి వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు, ప్రమాదకర వ్యాధులకు ఇప్పుడు ఇంగ్లీషు మందులు అందుబాటులో ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిన్నారి దగ్గరి నుంచి రేపో మాపో తనువు చాలించే వారి వరకు ఇంగ్లీషు మందులు వాడకుండా ఒక్కరు కూడా లేరని గంటాపథంగా చెప్పవచ్చు. నేటి కాలంలో ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది ఓ అలవాటుగా మారిపోయింది. ఉదయం పరగడుపు నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇంగ్లీషు బిల్లను అలా నోట్లో పడేస్తున్నాయి. అంతే కాదు యాంటీబయోటిక్ టాబ్లెట్లను చాక్లెట్లలా తినేస్తున్నాము. నిజానికి ఇంగ్లీషు మాత్రలు అతిగా వడటం వల్ల ప్రమాదం అని అనేవారు ఉన్నారు. కాని ఎలాంటి ప్రమాదం రాకుండా సత్వరంగా పరిష్కారాన్ని చూపించే సత్తువ ఈ మందుల్లోనే అధికంగా ఉంటుంది.
నిజానికి భారతదేశంలో మునుపు ఇంగ్లీషు మందుల వాడకం ఎక్కువగా ఉండేది కాదు. అప్పట్లో ఏ వ్యాధికైనా పసరు మందులు, ఆయుర్వేదం మందులు వాడేవారు. అప్పటి మనుషుల ఆహారపు విధానాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవి. కానీ నేడు రసాయనాల సేద్యం నడుస్తుండటంతో మనిషి తన సహజ శక్తిని కోల్పోతున్నాడు. వ్యాధినిరోధక శక్తి లేక అనేక రకాల ప్రమాదకర వైరస్‌లబారిన పడుతున్నారు. మూడేళ్ల క్రింత అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా. ఈ సమయంలో ఇంగ్లీషు మందులే కీలక భూమిక పోషించాయి. మనిషి శరీరంలో లోపించిన మినరల్స్, విటమిన్స్, రోగనిరోధక శక్తితో పాట రక్తాన్ని పెంచేందు ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఓ రకంగా వాటి పుణ్యమే ఇప్పుడు భయంకరమైన కరోనా బారి నుంచి బ్రతికి బయటపడ్డవారు చాలా మందే ఉన్నారు.
ఈ మధ్యకాలంలో క్యాన్సర్ మహమ్మారి అందరినీ వేధిస్తోంది. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. అంతే కాదు డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. 30 ప్లస్ వయస్సులోనే షుగర్ పేషెంట్స్‌గా మారుతున్నవారు చాలా మందే ఉన్నారు. ఈ కాలంలో వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి పోషకాహారం తీసుకోకుండా వ్యాధులతో సహజంగానే పోరాడుతామంటే కుదరని పరిస్థితి. అందుకే చాలా మంది ముందుగా ఇంగ్లీషు మందులను ప్రిఫర్ చేస్తున్నారు. డాక్టర్ల సలహా లను పాటిస్తున్నారు. కాస్త ఆరోగ్యం కుదుట పడిన తరువాత హోమీయో మందుల వాడకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆఫీసుల్లో పని చేసేశారు అనేక అలర్జీలతో సతమతమవుతుంటారు. జలుబు, తలనొప్పి, జర్వం వంటి సమస్యలు నిత్యం వారిని వేధిస్తుంటాయి. ఇలాంటి వారు హోమియో వైద్యం చేసుకోవాలంటే సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి సత్వరం ఉపశమనం కలిగితే ఇంగ్లీషు మందు లకు ప్రియారిటీ ఇస్తున్నారు. అనంతరం హోమియో వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.
హోమియోపతి వైద్యం. ఈ మధ్యకాలంలో దీనికి ఆదరణ పెరుగుతుంది. కానీ విశ్వసనీయత మాత్రం అంతగా లేదు. చూడటానికి తెల్లగా చిన్న గులికల్లా ఉండే హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులకు సరైన మందని చాలా మంది ప్రజలు భావిస్తుంటారు. అందుకే వీటికి ఆదరణ కూడా అంతే విధంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి మనిషి ఒక్కో వ్యాధితో మనోవేదన పడుతున్నాడు. అలర్జీలు, హై ఫీవర్, అర్థరైటిస్, సోరియాసిస్, షుగర్, బీపీ ఇలా అనేక రకాల జబ్బుల తో తల్లడిల్లుతున్నారు. ఇంగ్లీషు మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే కానీ దీర్ఘకాలంలో ఈ సమస్య వెంటాడుతూనే ఉంటోంది. అందుకే ఓ వైపు ఇంగ్లీషు మందులు మరోవైపు హోమియో మందులను వాడుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
నిజానికిగా రెండు వందల ఏళ్ల క్రితం హోమియో వైద్యం అందుబాటులోకి వచ్చింది. జర్మనీ వైద్యుడు ఈ పద్ధతిని కనిపెట్టాడు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లుగా ఏ పదార్ధం వ్యాధికి కారణంగా నిలుస్తుందో అదే పదార్ధంతో వైద్యం చేయడమే హోమియోపతి సూత్రం. ఆ సూత్రాన్ని వందల ఏళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశ ప్రజలు హోమియో వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పద్ధతిని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ వైద్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తుంటారు. కానీ కరోనా వంటి సమయంలోనూ హోమియో మెడిసిన్ కి మంచి ఆధరణ లభించింది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ మందులను ఎంతో సునాయాసంగా వేసుకోవచ్చు. రుచికి పంచదారలా ఉంటాయి. కానీ ఇది చేసే మేలు కూడా అంతే తియ్యగా ఉంటుంది. ఎన్నో ఇంగ్లీషు మందులు వాడినా కనిపించని ఫలితాన్ని దీర్ఘకాలంలో హోమియో మందుల ద్వారా పొందవచ్చు.
హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శాస్త్రపరమైన ఆధారాలు ఏమీ లేకపోయినా ఇప్పటి వరకు ఈ మందులను వాడుతున్నవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదనే చెప్పాలి. నిజానికి చాలా మంది హోమియో మందులతో రికవర్ అయిన వారు ఉన్నారు. ఓ పక్కన ఇంగ్లీషు మందులు వాడుతూనే మరో పక్కన హోమియో మెడిసిన్‌ను వేసుకుంటున్నారు. కారణంగా ఆరోగ్యంగా ఉండాలనే ఒకే ఒక్క కారణం. ఇంగ్లీషు మందులు మంచివా, హోమియో మందులు మంచివా అన్న వాదోపవాదాలు పక్కన పెడితే. గజిబిజి జీవితంలో నిరంతరం అనేక సమస్యలతో పోరాడుతున్న మనిషికి ఈ రెండు అవసరమని చెప్పక తప్పదు. అప్పటికప్పుడు రిలీఫ్ కావాలంటే ఇంగ్లీషు మందులు కావాలి, మరోమారు ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే హోమియో వాడాలి. కాబట్టి ఈ రెండూ పద్ధతులు మనిషికి అవసరమే.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.