Food: ఒకప్పుడు ఇంట్లో ఏం వండితే అదే తినేవారము. ఉదయం టిఫిన్స్ కూడా ఉండేవి కావు. పొద్దున్నే చక్కగా పెరుగన్నంతో కడుపునింపుకుని మధ్యాహ్నం కూరన్నం, ఆ తరువాత సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ అన్నం తిని హాయిగా ఉండేవారము. ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినా, ఆకలిగా ఉన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లోనే తయారు చేసే చిరుతిండ్లను చక్కగా బొజ్జనిండా భుజించేవారము. కానీ కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇంట్లో తినే తిండిని కాస్త ఆటవిడుపు కోసం హోటళ్లలో తినడం ప్రారంభించాము.
అక్కడితో భోజన ప్రియుల ఆహారపు అన్వేషణ ఆగిపోలేదు. పక్క దేశాల వారు ఇక్కడ మకాం వేసి వారి ఆహారాన్ని అలవాటు చేసేసారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసుల వల్ల ఇంట్లో వండుకుని తినడం ఎందుకు దండుగ చక్కగా ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే పోలా అన్న సంస్కృతికి చేరుకున్నాము. పోనీ ఆన్‌లైన్‌లలో ఏమైనా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామా అంటే అదీ లేదు. పిజ్జాలని, బర్గర్లని, నూడిల్స్ అని బిర్యానీలని రోజులకు తరబడి తింటూ భారతీయ జీవన ఆహార శైలిని విపరీతంగా మార్చేశాము.
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఇప్పుడు అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తినడానికి రుచికరంగా ఉండటంతో పాటు చూడటానికి అట్రాక్టివ్‌గా ఉండటం. రోజూ ఇంట్లో తినే ఆహారం కాకపోవడంతో అందరూ వాటి రుచికి టెంప్ట్ అయ్యి ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. నిజానికి అన్నానికి మించిన పరబ్రహ్మం మరొకటి లేదు. మనం ఎన్నో ఏళ్లుగా అన్నాన్ని తింటూ వస్తున్నప్పటకీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వెన్నాడలేదు. కానీ ఈ మధ్య కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ తినడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్సే. రోజుల తరబడి వాటిని స్టోర్ రూమ్‌లలో నిల్వ ఉంచి వండుతారు. అంతే కాదు అవి పాడవకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లలో పెడతారు. ఇక ఇవి రుచికరంగా ఉండేందుకు టేస్టింగ్ సాల్ట్స్ కలుపుతారు. అయినా అందరూ భలేగా ఉందంటూ లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. అంతే కాదండోయ్ సుమారు 30 నుంచి 40 శాతం వారి సంపాదించిన డబ్బును ఇలా రెస్టారెంట్‌లకు, తిండికే ఖర్చు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఫాస్ట్ ఫుడ్స్, మన ఆరోగ్యంపై అనేక ప్రభావాలు చూపుతాయి. ముందుగా డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతాయి. అధిక మొత్తంలో కార్బ్స్ ను విడుదల చేసి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుకుంది. తద్వారా డయాబెటీస్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు అసిడిటీ, అరుగుదల లేకపోవడం, కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రైడ్ పీస్, పేస్ట్రీలు, పిజ్జాలు, కేక్స్, కుక్కీలు అన్నింట్లో కూడా హెవీ షుగర్, ఫ్యాట్ కంటెంట్లు ఉంటాయి. వీటిని విపరీతంగా తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో ఈ మధ్య ఊబకాయం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
పెద్దవారు కూడా ఈ అనారోగ్య సమస్యలకు నిమిత్తం ఏమీ కాదు. ఊబకాయ సమస్యల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ఫ్యాట్, షుగర్ తో పాటు సోడియంను అధికంగా వినియోగిస్తారు అందుకే ఈ ఆహార పదార్ధాలు టేస్టీగా ఉంటాయి. కొద్దిగా వీటిని ఆహారంగా తీసుకున్నా కడుపు ఉబ్బరంగా, ఇబ్బందిగా ఉంటుంది. వారంలో రెండు మూడు సార్లు ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఛర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఫాస్ట్ ఫుడ్స్‌ను రెస్టారెంట్‌లలో తినేప్పుడు బిల్ లో ఎంత ఫ్యాట్ ఉంది ఏం కంటెంట్ ఇందులో ఉంది క్లియర్‌గా తెలుపుతారు. అది చూసి కూడా చూడనట్లు టేస్టీగా ఉన్నాయి కదా అని లాగించేస్తాము. నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల మన హోమ్ ఫుడ్ టేస్ట్‌ను చాలా మిస్ అవుతున్నాము. ఇంట్లో వండే వాటిలో ఎలాంటి పౌడర్లు వాడకుండా సురక్షితంగా, ఆరోగ్యంగా వండినా ఒంటికి ఎక్కవు. అందుకే చాలా మంది బయటి ఫుడ్‌కి వెంపర్లాడుతుంటారు. ఇప్పటికైనా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఇంటి ఫుడ్ తినడానికి మాత్రమే అలవాటు పడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికిరావు. జేబుకు వేలకు వేలు చిల్లు పడదు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.