Women: ఈ సృష్టిలో స్త్రీకి అత్యంత అపురూపమైనది ఏదైనా ఉందంటే అది మాతృత్వమే. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి పండంటి బిడ్డకు జన్మనిచ్చి స్త్రీగా పరిపక్వతను సాధిస్తుంది మహిళ. అనాదిగా మహిళలు పురిటి నొప్పులు పడే బిడ్డకు జన్మనిచ్చేవారు. కాన్పు అంటే మహిళలకు పునర్జన్మ లాంటిది. కానీ నేడు పురిటి నొప్పులు పడకుండానే బిడ్డకు జన్మనిస్తున్నారు. కత్తెర్లకు పని చెబుతూ డాక్టర్లు కాన్పులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సీ సెక్షన్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా వైద్యులు, అటు తల్లులు నొప్పుల బాధల నుంచి బయట పడాలన్న ఉద్దేశ్యంతో కత్తెర్లకు పని చెబుతున్నారు. 4 గంటలు నొప్పులు పడితే తీరిపోయే దానిని జీవిత కాలం అనారోగ్య సమస్యలను భరిస్తున్నారు. అనేక రకాల బాధలు పడుతున్నారు.
ప్రెగ్నెంట్ అయిన దగ్గరి నుంచి బిడ్డ కోసం తల్లి ఆలోచిస్తుంటుంది. కడుపులో ఉన్నప్పుడే బేబీకి ఏం కావాలో తెలుసుకుని అందిస్తుంది. కానీ తల్లిగా తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించడం లేదు. డెలివరీ తరువాత కూడా పిల్లల సంరక్షణకే ప్రాధాన్యత ఇస్తుంది. నార్మల్ డెలివరీ అయితే తన గురించి పట్టించుకో కున్నా ఫరవాలేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోలేని వారు చాలా మంది అనేక అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్నారు.
9 నెలలు బిడ్డను మోసిన తల్లులు పురిటి నొప్పులు పడేందుకు ఇష్టపడటం లేదు. అదో పెద్ద ప్రమాదంగా గుర్తిస్తున్నారు. నిజానికి మన తాతల ముత్తాల కాలం లో ఏ సిజేరియన్‌లు లేవు, హాస్పటళ్లు ఇప్పుడున్నం తగా కూడా లేవు. పురుడు పోయాలంటే మంత్రసాని వచ్చి పోసేది. ఇప్పటికీ మారుమూ పల్లెటూర్లల్లో హాస్పిటళ్ల సౌకర్యాలు లేని దగ్గర ఇంట్లోనే పిల్లలను సాధారణ పద్ధతుల్లో నొప్పులు పడి మరీ పిల్లలను కంటున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలను కనడానికే నానా యాతన పడుతున్నారు. నొప్పులు పడకూడదని కత్తిరింపులు చేసుకుంటున్నా రు. మన అమ్మలు, వారి అమ్మలు, వారి అమ్మలు అందరూ గంపడేసి పిల్లలను కనేవారు. అప్పట్లో ఒక మహిళ డజన్ల కొద్ది పిల్లలను కనేది. కానీ ఆ సంఖ్య కాలంతో పాటే మారింది.
నేడు ఇద్దరు పిల్లలను ఓ మహిళ కనడం అనేది ఎంతో గొప్ప విషయం. అసలు గర్బాధారణ జరగక కృత్రిమాలకు పరుగులు పెడుతున్న రోజులు ఇవి. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం హాస్పిటళ్ల సంఖ్య పెరగడంతో ప్రసవం ఇప్పుడు ఎంతో సునాయాసం అయ్యింది. కానీ చాలా వరకు గర్భిణులు సాధారణ డెలివరీలకు మొగ్గు చూపడం లేదు. నాలుగు గంటలు పురిటి నొప్పులు పడలే మని తేల్చిచెబుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. హాస్పిటళ్ల నిర్వాహ కులు రిస్క్ ఎందుకని, పైసలు దండుకోవచ్చని సి సెక్షన్లకే ప్రేరేపిస్తు న్నారు. చాలా వరకు ప్రైవేటు హాస్పిటల్స్‌లో ప్రభుత్వ దవాఖాణాల్లో సిజేరియన్ల సంఖ్య అధికంగా నమోదువుతోంది.
ఇక కొంత మంది తల్లులు అసలు సిజేరియనే వద్దంటే ఏకంగా ముహూర్తాలు, లగ్నాలు, శుభగడియలు పెట్టుకుని మరి ఆపరేషన్‌లు చేసుకుంటూ వింత పోకడ లకు పోతున్నారు. కొంత మంది జాతకాలు నమ్మి బిడ్డకు గండమని నెలలు నిండ కుండానే జన్మనిస్తున్నారు. ఇలాంటి అసహజ చర్యల వల్ల అటు పిల్లలే కాదు తల్లులు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారు. అడ్డు చెప్పాల్సిన పెద్దలు కూడా మద్దతు తెలుపుతుండటం ఆలోచించాల్సిన విషయం. ఇక కొంత మంది డాక్టర్లు వైద్యంపై అవగాహన లేక నార్మల్ డెలివరీ చేస్తే ఎక్కడ లేనిపోని చిక్కుల్లో పడతా మోనన్న సందేహంతో కనీసం నార్మల్ డెలివరీకి ట్రై చేయకుం డానే ఆఫరేషన్‌లు చేసేస్తున్నారు. ఈ నిర్వాకాలు ఎక్కువయ్యాయనే ఇటీవల తెలంగాణ వైద్య శాఖ సిజేరియన్లకు చెక్ చెప్పేందుకు విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.
సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తే హాస్పిటల్ లైసెన్సులను రద్దు చేస్తామని ప్రకటించింది. అంతే కాదు సిజేరియన్‌కు ప్రోత్సహించే డాక్టర్ల లైసెన్సును రద్దు చేయనుంది. ప్రైవేట్ హాస్పిటళ్లల్లో సీజేరియన్ల సంఖ్య నింయంత్రించే బాధ్యతలను కలెక్టర్లు, వైద్యా ధికారుల మీద వేశారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. గర్భిణి ఆరోగ్య పరిస్థితి మరీ బాగోపోతేనే సిజేరియన్‌కు వెళ్లాలని ఖరాకండీగా తెలిపారు.
ఇక సిజేరియన్ల వల్ల కలిగే దుష్ప్రాభావాలపై ఇప్పుడు చర్చించుకుందాం. ఆపరేషన్ తరువాత గర్భాశయం తొలగించే అవకాశం ఉటుంది. దానికి కారణం ఆపరేషన్ చేసే సమయంలో రక్తస్రావం అధికంగా జరగడం. ఇక ఆపరేషన్ సమయంలో వెన్ను పూసకు ఇచ్చే మత్తు మందు వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన నడుం నొప్పి ఏర్పడు తుంది. ఎక్కువ సేపు కూర్చున్నా పడుకున్నా అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతే కాదు ఆపరేషన్ తరువాత కోలుకున్నా దీర్ఘకాలంలో ఎక్కువ సేపు టీవీ చూసినా పాటలు పాడినా ఏదైన పని చేసినా తలనొప్పి బారినపడే సందర్భాలు లేకపోలేదు. ఇక డెలివరీ సమయంలో పొత్తి కడుపు కింద చేసే కత్తిరింపు జీవితకాలం అలాగే ఉంటుంది.
అంతకు ముందు వరకు ఎంతో చలాకిగా చురుకుగా ఉన్నా సిజేరియన్ తరువాత మహిళ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. బరువు పెరగడం కూడా అందులో ఒక సమస్య. అంతే కాదు ఆఫీస్ పనుల నిమిత్తం వాహనాల్లో ప్రయాణించాలన్నా, ఎక్కువ సేపు నిలుచుని పనిచేయాలన్నా శరీరం సహకరించదు. నీరసంగా ఉంటారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇంకా సిజేరియన్‌కే సై అంటే చేసేదేమి లేదు. తల్లులు ఇకనైనా మేల్కొనండి కత్తిరింపులకు చెక్ చెప్పండి. సహజ ప్రసవాలకు ప్రాధాన్యతను ఇచ్చి ఇటు మీ ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.