Pooja: ఆధునిక కాలంలో అందరిదీ హడావిడి జీవితమే. నిముషం ఖాళీ లేకుండా ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోతున్నారు ప్రజలు. భార్య భర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కానీ ఇళ్లు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఇంటి పని చేసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది రోజూ దేవుడికి పూజ చేయటం అంటే అదో పెద్ద పనిగా అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఈ రోజుల్లో ప్రశాంతంగా దేవుడి మందిరంలో కూర్చుని పూజ చేసే మహిళల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అవును దేవుడికి రోజూ పూజ చేయకపోతే ఏమౌతుంది కళ్లుపోతాయా? దేవుడు శపిస్తాడా? అని వాధించేవారు లేకపోలేదు.
నిజానికి రోజూ పూజ చేయకపోతే శపించేటంత మూర్ఖుడు కాడు దేవుడు. కళ్లు అంతకన్నాపోవు. పూజ అనేది ఓ తపస్సు లాంటిది. మానసిక వికాసానికి అది ఒక మార్గం లాంటిది. అది తెలియక చాలా మంది ఆదరాబాదరాగా , హంగు ఆర్భాటాలతో భారీ ఎత్తున పూజలు చేస్తుంటారు. ఇంకొంతమంది అసలు పూజా మందిరం తలుపే తట్టరు. ప్రతి రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి లేకపోతే కళ్లుపోతాయి. దీపాన్ని ఈ నూనెతోనే వెలిగించాలి లేకపోతే దేవుడికి కోపం వస్తుంది. భారీగా ప్రసాదాలు పెడితేనే దేవుడు కరునిస్తాడు. అలంకరణ గొప్పగా ఉంటేనే అమ్మవారు ఆశీర్వదిస్తుంది.
ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తేనే స్వామి కరుణ లభిస్తుందని చాలా మంది చిన్నపిల్లల్లా ఆలోచిస్తుంటారు. నిజానికి దేవుడు ఇవేమీ అడగడు. ఆయన నిరాకారుడు , నిరంజనుడు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు. అందుకే ఆయనకు చేసే పూజలోనూ ప్రజల సంతోషాలనే వెతికే స్వభావం కలిగిన వాడు దేవుడు. తల్లి్ద్రండులకు పిల్లల మీద ఎలాంటి ప్రేమ, అనురాగం, మమకారం ఉంటుందో దేవుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ దేవుడు తన పిల్లలే అని అనుకుంటాడు. అందరిపైన చల్లని చూపు చూపుతాడు.
మనిషి మనుసు నిలకడగా ఉండదు. సందర్భాన్ని బట్టి అది మారిపోతుంటుంది. మనసు నిలకడగా ఉండటానికి పూజ చేయడం ఎంతో అవసరం అని దైవజ్ఞులు తెలిపే మాట ఇది. మన మనసు కోపానికి, క్రోదానికి, మత్తు, మందు ,జూదానికి బానిసలుగా మారకుండా ఉండటానికి పూజ ఒక సాధనంగా పనిచేస్తుంది. మన మనసును నిలకడగా ఉంచి చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా నియంత్రిస్తుంది.
దేవుడికి స్థోమతను బట్టి నెయ్యి దీపాలు, లేదా నూనె దీపాలు పెడుతుంటారు. నెయ్యి దీపం పెడితేనే అధిక పుణ్యం లభిస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులోనూ ఓ ఆరోగ్య సూత్రం దాగి ఉంది. దీపం పెట్టి ఆ దీపం ముందు కొద్ది సమయం గడపటం వల్ల ఆ దీపపు వెలుగులతో కంటి జబ్బులు పోతాయని పెద్దలు చెప్పే మాటలు. అంతే కానీ ఏ పదార్ధంతో దీపం పెట్టినా పలకరించే మహోన్నతుడు దేవుడు.
ఇక చాలా మంది ఇళ్లల్లో ప్రతి రోజు 108 నామాలను జపిస్తుంటారు. క్లిష్టమైన మంత్రాలను దేవుడి ముందు ఉచ్ఛరిస్తుంటారు. ఇది కూడా శరీరానికి ఒకరకంగా వ్యాయామమే. ఇలా క్లిష్టమైన పదాలను చెప్పడం వల్ల తెలుగుపై పట్టు రావడంతో పాటు నాలిక మొద్దుబారకుండా మాట స్పష్టత వస్తుంది.
పూజ అనేది హైందవి ధర్మం. అది అందరూ పాటిస్తే ఆరోగ్యం. అందుకే ప్రతి రోజు పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు. అసలు విషయం చేయక అపార్థాలను చేసుకునే వారికి కనువిప్పు కలగాలనే ఈ కథనం మీ ముందుంచుతున్నాము. దైవారాధనలో మీరూ లీనమై ఆ దేవుని ఆశిస్సులను పొంది దీర్ఘాయువులుగా ఉంటారని ఆశిస్తున్నాము.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.