Spiritual: పురాతనకాలంలో ప్రజలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగించేవారు. కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఆవాసాలు వేసుకొని జీవించే వారు. అలా ఆయా కుటుంబాలు వారసత్వం పెరిగి, ఇంటి పేర్లు మార్చుకొని వందలాది కుటుంబాల సమూహంగా మారాయి. అలాగే పల్లెటూళ్ళు, గ్రామాలు మన జీవన విధానంలో భాగం అయ్యాయి. ఇప్పుడంటే జీవన విధానాలలో మార్పుల కారణంగా పట్టణాలు పెరిగాయి కాని 20 ఏళ్ళ క్రితం వరకు గ్రామాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా కుటుంబంతో కలిసి సొంత ఊరిలోనే ఏదో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటూ, కుల వృత్తులపై బ్రతుకుంటూ జీవించే వారు.
అయితే సంపాదన పై ద్యాస పెరిగిన తర్వాత ఉద్యోగాల కోసం, అధిక సంపాదన కోసం పట్టణాలకి వలస వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇక గ్రామాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేవి గ్రామ దేవతల పండగలు. ప్రతి ఏడాది ఈ గ్రామ దేవత పండగలు జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగల సమయంలో గ్రామంలోని అందరూ అమ్మవారికి పసుపు, కుంకుమలు ఇవ్వడం, అలాగే పశువులని, జంతువులని బలిఇచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఈ ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది.
భారతీయ మూలవాసులకి శివ, కేశవులు తెలికముందే ప్రకృతిని, పంచభూతాలని ఆరాధించేవారు. ప్రకృతిలో ఉన్న గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశాన్ని శక్తి స్వరూపిణిగా భావిస్తూ రూపం లేకుండానే ఆరాధించేవారు. ఎవరో ఒకరి కలలో శక్తి స్వరూపిణి అదృశ్య రూపంగా కనిపించి తన ఆనవాళ్ళు చెప్పేది అని, ఆ ఆనవాళ్ళు ఆధారంగా గ్రామంలోని ప్రజలందరూ అమ్మవారు పలానా ప్రాంతంలో కొలువై ఉంది అని భావించి అక్కడ గుడి కట్టి పూజలు చేయడం చేసే వారు. అలాగే వేపచెట్టు, మర్రిచెట్టుని కూడా గ్రామదేవత రూపాలుగా భావించి ఆరాధించే వారు. ఇప్పటికి ఎవరికైనా ఆటలమ్మ డిసీజ్ వస్తే అమ్మవారు పట్టింది అని భావించి వేపచెట్టు ఆకులని వారిపై ఉంచి అమ్మవారిని శాంతింప జేస్తారు నూకాలమ్మ, పైడమ్మ, మావూళ్ళమ్మ, అంకాలమ్మ, పొలమ్మ, కుంకుళ్ళమ్మ, గోగులమ్మ, కామాక్షమ్మ, ఎల్లమ్మ, మెరక తల్లి, పైడితల్లమ్మ, తలుపులమ్మ, దేవుల్లమ్మ, పరదేసమ్మ, గంగమ్మ, బతుకమ్మ అనే రకరకాల పేర్లతో గ్రామ దేవతలని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కొలుస్తూ ఉంటారు.
ఈ పేర్లు అన్ని కూడా అమ్మవారు వెలిసిన ప్రాంతం బట్టి వారికి ఆయాగ్రామల ప్రజలు పెట్టుకున్నవే. అయితే భారతీయ వైదిక సనాతన ధర్మాలలో ఈ గ్రామ దేవతల ప్రస్తావన ఎక్కడా కూడా ఉండదు. దీనికి కారణం అగ్ర కులాల వారు శుద్ర కులాల వారిని వైదిక దేవతలకి దూరం చేస్తే వారు తమకంటూ ప్రత్యేకంగా ప్రకృతిని దేవతా శక్తిగా భావించి గ్రామీణ దేవతలని ప్రతిష్టించుకొని ఆరాధించడం మొదలు పెట్టారు. కాలక్రమంలో ఈ గ్రామదేవతలని పూజించే వారు ఎక్కువ కావడంతో వారిని వైదిక శాస్త్రాలలో కలిపేసి శక్తి స్వరూపిణిగా గ్రామదేవతలని మార్చేశారని చాలా మంది చెబుతూ ఉంటారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.